కరెంట్‌ అఫైర్స్‌

దేశంలోనే మొదటిది అయిన వైడ్‌ ప్లేట్‌ మిల్‌ను 2022, డిసెంబరు 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏ నగరంలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు?

Published : 25 Jan 2023 00:06 IST

మాదిరి ప్రశ్నలు

దేశంలోనే మొదటిది అయిన వైడ్‌ ప్లేట్‌ మిల్‌ను 2022, డిసెంబరు 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏ నగరంలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు? (ఈ నగరంలోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిశ్రధాతు నిగమ్‌ (మిధాని) లిమిటెడ్‌లో రూ.600 కోట్ల అంచనా వ్యయంతో 30 వేల టన్నుల వార్షిక సామర్థ్యంతో దీన్ని నిర్మించారు) 

జ: హైదరాబాద్‌


జెమ్‌ (GEM- గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మానిటర్‌) రూపొందించిన కొత్త వ్యాపారాలను సులువుగా ప్రారంభించడానికి అనువైన అయిదు దేశాల్లో భారత్‌ ఎన్నో స్థానంలో నిలిచింది? (సౌదీ అరేబియా, నెదర్లాండ్స్‌, స్వీడన్‌లు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి)

జ: నాలుగో స్థానం


2022, నవంబరు 14 - 17 తేదీల్లో ఐసీఎఫ్‌పీ (ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఫ్యామిలీ ప్లానింగ్‌) సమావేశాన్ని ఏ దేశంలోని పట్టాయలో నిర్వహించారు? (అత్యాధునిక, అత్యంత నాణ్యమైన కుటుంబ నియంత్రణ విధానాలను అనుసరిస్తున్నందుకు భారత్‌కు ఈ సదస్సులో ‘ఎక్సెల్‌ అవార్డు’ను ప్రదానం చేశారు)                                    

జ: థాయ్‌లాండ్‌


ప్రస్తుత 2022 - 23 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు చివరికి కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాల మొత్తం ఎంతకు చేరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది? (2022 జూన్‌ చివరికి ఇవి రూ.145.72 లక్షల కోట్లుగా ఉన్నాయి) 

జ: రూ.147.19 లక్షల కోట్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని