భారతీయ కోర్సులకు టాప్‌ ర్యాంకులు

తాజాగా విడుదలైన క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో.. ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న టాప్‌ 100 కోర్సుల్లో 44 భారతీయ కోర్సులకు చోటు దక్కింది.

Published : 30 Mar 2023 00:01 IST

తాజాగా విడుదలైన క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో.. ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న టాప్‌ 100 కోర్సుల్లో 44 భారతీయ కోర్సులకు చోటు దక్కింది.

ర్యాంకులు దాదాపు 54 సబ్జెక్టుల్లో ప్రకటించారు. వీటిలో ఇండియన్‌ యూనివర్సిటీలు.. కంప్యూటర్‌ సైన్స్‌, కెమిస్ట్రీ, బయొలాజికల్‌ సైన్సెస్‌, బిజినెస్‌ స్టడీస్‌, ఫిజిక్స్‌... తదితర సబ్జెక్టుల కోర్సుల్లో అగ్రగాములుగా నిలిచాయి. ఈ ర్యాంకులు ఇవ్వడం కోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,594 యూనివర్సిటీల నుంచి 15,700 కోర్సులను పరిశీలించారు. వీటిలో మన దేశం నుంచి 66 యూనివర్సిటీలకు చోటు దక్కింది.

మొత్తం అన్నింటిలోకీ సవీతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ టెక్నికల్‌ సైన్సెస్‌ (చెన్నై) అందిస్తున్న డెంటిస్ట్రీ కోర్సు భారత్‌ నుంచి తొలిస్థానం దక్కించుకుంది. గ్లోబల్‌గా దీని ర్యాంకు 13. దీని తర్వాతి స్థానంలో ఐఐటీ మద్రాసు అందిస్తున్న పెట్రోలియం ఇంజినీరింగ్‌, ఐఎస్‌ఎం (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌) అందిస్తున్న మినరల్‌ అండ్‌ మైనింగ్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు నిలిచాయి (గ్లోబల్‌ ర్యాంకులు వరుసగా 21, 25). ఇవి కాక ఐఐటీ బాంబే అందిస్తున్న మ్యాథమెటిక్స్‌ కోర్సుకు 92వ ర్యాంకు, ఐఐటీ కాన్పూర్‌ అందిస్తున్న ఇంజినీరింగ్‌-ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్‌ కోర్సుకు 87వ ర్యాంకు, ఇదే సంస్థ అందిస్తున్న కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ కోర్సుకు 96వ ర్యాంకు లభించాయి.

ఈ ర్యాంకులు అందించడానికి 5 విషయాలను పరిగణనలోకి తీసుకున్నారు. అకడమిక్‌ నాణ్యత, ఉద్యోగావకాశాలు, పరిశోధన, హెచ్‌-ఇండెక్స్‌, ఇంటర్నేషనల్‌ రిసెర్చ్‌ నెట్‌వర్క్‌ అంశాల ఆధారంగా వీటిని ప్రకటించారు. హెచ్‌-ఇండెక్స్‌ అనేది విద్యార్థి నైపుణ్యాలను, సబ్జెక్టు పరిజ్ఞానాన్ని శాస్త్రీయంగా తెలుసుకునే విధానం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని