కరెంట్‌ అఫైర్స్‌

అత్యల్ప దూరం ఎగిరే బల్లి జాతికి చెందిన చిన్న జీవిని భారత్‌లో తొలిసారిగా ఇటీవల మిజోరంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. చెట్లపై జీవించే దీనికి ఏ పేరు పెట్టారు?

Published : 28 May 2023 02:27 IST

మాదిరి ప్రశ్నలు

* అత్యల్ప దూరం ఎగిరే బల్లి జాతికి చెందిన చిన్న జీవిని భారత్‌లో తొలిసారిగా ఇటీవల మిజోరంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. చెట్లపై జీవించే దీనికి ఏ పేరు పెట్టారు? (ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ఒక్క ఉదుటున దూకడం దీని ప్రత్యేకత. 20 సెం.మీ. పొడవుండే ఈ జీవికి గెంతేందుకు అనువుగా తోక చివరి భాగం పైకి వంగి ఉంటుంది. ఈ పరిశోధనలో జర్మనీలోని మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయాలజీ పరిశోధకులు కూడా పాలుపంచుకున్నారు.)  

జ: గెక్కో మిజోరమెన్సిస్‌


* ప్రపంచ వ్యవసాయ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? (సాగు కార్యకలాపాలను పర్యాటకంతో జతచేసి సందర్శకులకు ఉల్లాసాన్ని పంచే వ్యాపార నమూనాయే అగ్రి టూరిజం. దేశంలో మొదట మహారాష్ట్రలో ప్రారంభమైన అగ్రి టూరిజం ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ఏటా 4 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నట్లు ప్రపంచ టూరిజం సంస్థ అంచనా వేసింది. భారత్‌లో మాత్రం ఇది 10.1 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. ఓ అధ్యయనం ప్రకారం భారత్‌లో అగ్రి టూరిజం ఏటా 20 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది.)

జ: మే 16


* ‘హోజైల్‌ హోమ్‌ ల్యాండ్స్‌ : ద న్యూ అలయెన్స్‌ బిట్విన్‌ ఇండియా అండ్‌ ఇజ్రాయెల్‌’ పుస్తకాన్ని ఇటీవల ఎవరు రూపొందించారు? (భారత్‌ - ఇజ్రాయెల్‌ మధ్య సంబంధాలను ఈ గ్రంథంలో అక్షర బద్ధం చేశారు.)

జ: ఆజాద్‌ ఎస్సా


* దేశీయంగా చదువుకునే సమయంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల కష్టాలు తీర్చడానికి ఉన్నత విద్యాసంస్థల్లో ‘ఎర్న్‌ వైల్‌ లెర్న్‌ - చదువుతూ సంపాదన’ పథకాన్ని ప్రవేశపెట్టాలని ఏ సంస్థ ప్రతిపాదించింది? (ఈ మేరకు దేశంలోని అన్ని కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో పాటు ఇతర విద్యా సంస్థలకు ఈ సంస్థ ఇటీవల సంబంధిత ముసాయిదాను పంపింది.)

జ: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని