కరెంట్‌ అఫైర్స్‌

ఇటాలియన్‌ ఓపెన్‌-2023 పురుషులు, మహిళల విజేతలు వరుసగా?

Published : 03 Jun 2023 01:26 IST

మాదిరి ప్రశ్నలు

ఇటాలియన్‌ ఓపెన్‌-2023 పురుషులు, మహిళల విజేతలు వరుసగా?

జ:  డేనియల్‌ మెద్వదేవ్‌, ఎలెనా రిబకినా


ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ)ను ఏ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తారు?                  

జ: న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్‌


నేషనల్‌ పంచాయత్‌ అవార్డ్స్‌ 2023లో అత్యధికంగా 8 పురస్కారాలు గెలుచుకున్న రాష్ట్రం ఏది? 

జ: తెలంగాణ


ప్రపంచ బ్యాక్‌అప్‌ దినోత్సవాన్ని ఏటా మార్చి 31న నిర్వహిస్తారు. 2023 సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని ఏ థీమ్‌తో నిర్వహించారు?

జ: ప్రొటెక్ట్‌ యువర్‌ డిజిటల్‌ లెగసీ


100 శాతం రైల్వే మార్గాన్ని విద్యుదీకరించిన తొలి రాష్ట్రం ఏది?

జ: హరియాణా


దేశంలోనే తొలిసారిగా 2030 నాటికి అన్ని ప్రభుత్వ విభాగాల్లో 100 శాతం ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉపయోగించాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది?

జ: ఉత్తర్‌ ప్రదేశ్‌  


‘ది బ్యాంకర్‌ టు ఎవ్రీ ఇండియన్‌’ పేరిట ఏ బ్యాంకు ఇటీవల కాఫీ టేబుల్‌ బుక్‌ను విడుదల చేసింది?

జ: ఎస్‌బీఐ  


ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఎంత శాతం మేర వృద్ధి నమోదు చేస ్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది? (ఆ తర్వాత అయిదేళ్లలో సగటున వృద్ధి 6.1 శాతం మేర ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.)

జ: 5.9 శాతం


2030 నాటికి పక్షవాతంతో ఏటా దాదాపు 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు హెచ్చరించారు? 

జ: చైనా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని