కాడ్మియం కలుషితాలతో ఇటాయ్‌-ఇటాయ్‌!

అధిక ఎరువులు, రసాయన వ్యర్థాలు చేరిన నేలల్లో పండిన పంటలతో ఆరోగ్యం పాడైపోతుంది. పరిమితికి మించిన శబ్దాలతో ఒత్తిడి, నిద్రలేమి ఏర్పడి గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

Updated : 03 Jun 2023 02:10 IST

పర్యావరణ  అంశాలు

అధిక ఎరువులు, రసాయన వ్యర్థాలు చేరిన నేలల్లో పండిన పంటలతో ఆరోగ్యం పాడైపోతుంది. పరిమితికి మించిన శబ్దాలతో ఒత్తిడి, నిద్రలేమి ఏర్పడి గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కృత్రిమ కాంతి తీవ్రత వల్ల నిద్ర సరిగా పట్టదు. ఇతర ఇబ్బందులూ ఉన్నాయి. నీరు కలుషితమైపోతే అందులోని జీవులు నశించి పర్యావరణం దెబ్బతింటుంది. ఆ నీళ్లు తాగిన మనుషులు అనారోగ్యాల పాలవుతారు. కాలుష్యం అన్ని రకాలుగా వినాశనకరం. పర్యావరణ అంశాల అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు రకరకాల కాలుష్యాలు, వాటి కారకాలు, ప్రభావాల గురించి తెలుసుకోవాలి.

నేల కాలుష్యం, ధ్వని కాలుష్యం, కాంతి కాలుష్యం, నీటి కాలుష్యం

1. నేల కాలుష్యం జరగడానికి మానవ కారణాలు?

1) జంతువులు, మానవ వ్యర్థాలు

2) పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు

3) గృహాల నుంచి వెలువడే చెత్త  

4) పైవన్నీ

2. ఏ పర్యావరణ సమస్య వల్ల నేల కాలుష్యం జరుగుతుంది?

1) గ్లోబల్‌ వార్మింగ్‌ 

2) గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌

3) ఆమ్ల వర్షం

4) పర్యావరణ మార్పులు

3. పంట అవశేషాలను పెద్ద మొత్తంలో తగలబెట్టడం వల్ల కలిగే ప్రభావాలు?

1) నేల కాలుష్యం 

2) వాయు కాలుష్యం

3) పొగమంచు

4) పైవన్నీ

4. నేల కాలుష్యం వల్ల ఎలాంటి ప్రభావాలు ఏర్పడతాయి?

1) సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు పెరగవు.

2) భూగర్భ జల కాలుష్యం జరుగుతుంది.

3) నేలలోని హానికర రసాయనాలు ఆహార గొలుసులోకి ప్రవేశిస్తాయి.

4) పైవన్నీ

 

5. నేల కాలుష్యానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) వ్యవసాయంలో వాడే రసాయనాల వల్ల నేల కలుషితమవుతుంది.

2) నేల కాలుష్యం వల్ల నేల సారం తగ్గుతుంది.

3) దీనివల్ల నేలలో కీటకాలు, వానపాములు ఎక్కువ అవుతాయి.

4) మైనింగ్‌, క్వారీ, నిర్మాణ వ్యర్థాల వల్ల నేల కాలుష్యం ఏర్పడుతుంది.

6. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నేల కాలుష్యం పెరగడానికి కారణాలు?

1) రేడియోధార్మిక వ్యర్థాలు  

2) గృహాల నుంచి వెలువడే చెత్త

3) వ్యవసాయంలో వాడే రసాయనాలు    

4) పారిశ్రామిక వ్యర్థాలు

7. 3ళి సూత్రం ఏ ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది?

1) ఘనరూప వ్యర్థాలు

2) ఆమ్ల వర్షం

3) ద్రవరూప వ్యర్థాలు 

4) ఓజోన్‌ రంధ్రం

8. నేల కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడే కింది చర్యల్లో సరికానిది?

1) ఘనరూప వ్యర్థాల సమర్థ నిర్వహణ

2) పారిశ్రామిక వ్యర్థాలను పూర్తిగా శుద్ధి చేసి బయటకు వదలడం

3) వ్యవసాయంలో అధునాతన పద్ధతులను వినియోగించడం

4) జీవ విచ్ఛిన్న వ్యర్థాలను ఎరువు, బయో గ్యాస్‌గా మార్చడం

9. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఎంత తీవ్రత వరకు ఉండే ధ్వని మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపదు?

1) 45 డెసిబుల్స్‌

2) 90 డెసిబుల్స్‌

3) 120 డెసిబుల్స్‌ 

4) 150 డెసిబుల్స్‌

10. మన పరిసర ప్రాంతాల్లో ఏ కారణాల వల్ల ధ్వని కాలుష్యం జరుగుతుంది?

1) వాహనాల ఇంజిన్‌లు, హారన్‌లు

2) సంగీత పరికరాలు

3) శబ్దాన్ని కలిగించే పటాసులు 

4) పైవన్నీ

11. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం ఏ ప్రాంతాల్లో పగలు ధ్వని తీవ్రత 75 డెసిబుల్స్‌ వరకు ఉండొచ్చు?

1) పారిశ్రామిక వాడలు    

2) వాణిజ్య సంస్థల ప్రాంతం

3) నివాస సముదాయాల ప్రాంతం    

4) సైలెన్స్‌ జోన్స్‌

12. అత్యధిక హాని కలిగించే ఎక్కువ శబ్దమైన సోనిక్‌ బూమ్‌ లేదా షాక్‌ వేవ్‌ ఏ సందర్భంలో వెలువడుతుంది?

1) రాకెట్‌ ప్రయోగ సమయం        

2) క్షిపణి ప్రయాణించేటప్పుడు

3) యుద్ధ విమానం ప్రయాణించినప్పుడు

4) పైవన్నీ

13. ధ్వని తీవ్రత ఎంతకు మించినప్పుడు మన ఆరోగ్యంపై చెడు ప్రభావం కలుగుతుంది?

1) 120 డెసిబుల్స్‌

2) 90 డెసిబుల్స్‌  

3) 150 డెసిబుల్స్‌

4) 110 డెసిబుల్స్‌

14. ధ్వని కాలుష్యం వల్ల ఏ హార్మోన్‌ శరీరంలో ఎక్కువ స్రావితమై గుండె వేగం పెరుగుతుంది?

1) థైరాక్సిన్‌

2) ఇన్సులిన్‌  

3) అడ్రినలిన్‌

4) గ్లూకగాన్‌

15. ధ్వని కాలుష్యం ఎక్కువైతే శరీరంలో ఎలాంటి ప్రభావాలు కలుగుతాయి?

1) నిద్ర పట్టకపోవడం

2) వికారం, అలసట

3) రక్తపోటు పెరగడం

4) పైవన్నీ

16. వేటి నుంచి వెలువడే శబ్దం శాశ్వత చెవుడును కలిగించే అవకాశం ఉంది?

1) సూపర్‌సోనిక్‌ వేగంతో వెళ్లే విమానాలు    

2) లౌడ్‌ స్పీకర్ల నుంచి వెలువడే ధ్వని

3) బస్సు హారన్‌ల నుంచి వెలువడే ధ్వని    

4) వాహనాల నుంచి వెలువడే ధ్వని

17. ఏ చర్యలు చేపట్టడం వల్ల ధ్వని కాలుష్య తీవ్రతను తగ్గించవచ్చు?

1) ఎక్కువ శబ్దాన్నిచ్చే వాహనాల హారన్‌లను నిషేధించడం.

2) పరిశ్రమలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించడం.

3) పనిచేసే ప్రదేశాల్లో ఇయర్‌ ప్లగ్స్‌ ధరించడం.

4) పైవన్నీ

18. కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం ద్వారా వివిధ నగరాల్లో శబ్ద కాలుష్య తీవ్రతను లెక్కిస్తుంది?

1) నేషనల్‌ ఆంబియంట్‌ నాయిస్‌ మానిటరింగ్‌ నెట్‌వర్క్‌

2) నేషనల్‌ సౌండ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం

3) సెంట్రల్‌ సౌండ్‌ కంట్రోల్‌ మానిటరింగ్‌ ప్రోగ్రాం

4) సెంట్రల్‌ వెహికల్‌ సౌండ్‌ మానిటరింగ్‌ నెట్‌వర్క్‌

19. కాంతి కాలుష్యం వల్ల మన శరీరంలో ఏ హార్మోన్‌ స్రవించడంలో మార్పు కలుగుతుంది?

1) మెలనిన్‌

2) మెలటోనిన్‌  

3) ఎపినాఫ్రిన్‌ 

4) థైరాక్సిన్‌

20. కాంతి కాలుష్యానికి కారణాలు?

1) పగటి సమయంలో సూర్యుడి నుంచి వెలువడే కాంతి

2) రాత్రి సమయంలో వెలువడే చంద్రుడి కాంతి

3) రాత్రి పూట మానవ చర్యల వల్ల వెలువడే కృత్రిమ కాంతి

4) నక్షత్రాల నుంచి వెలువడే కాంతి

21. కాంతి కాలుష్యం మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

1) జీవ గడియారం దెబ్బతింటుంది.

2) హైపోథలామస్‌ దెబ్బతింటుంది.

3) కేంద్ర నాడీ వ్యవస్థ ప్రభావితమవుతుంది.

4) చిన్న మెదడు దెబ్బతింటుంది.

22. నీటి కాలుష్యానికి ముఖ్యమైన మానవ కారణాలు?

1) మురుగు నీరు

2) పారిశ్రామిక వ్యర్థ జలాలు

3) వ్యవసాయంలో వాడే రసాయనాలు

4) పైవన్నీ

23. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు కలుషితమవడానికి కారణం?

1) కీటక నాశనులు 

2) మురుగు నీరు

3) ఎరువులు 

4) రేడియోధార్మిక పదార్థాలు

24. మురుగునీటి కారణంగా తాగునీరు కలుషితమై ఏ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది?

1) కలరా

2) డయేరియా  

3) టైఫాయిడ్‌ 

4) పైవన్నీ

25. ఏ కాలుష్య కారకం మన శరీరంలోకి చేరి పక్షవాతం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, అలసట లాంటి లక్షణాలను కలిగిస్తుంది?

1) సీసం

2) రాగి  

3) నికెల్‌ 

4) మాంగనీస్‌

26. భారత్‌లో కొన్ని ప్రాంతాల తాగునీటిలో ఏ మూలకాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు?

1) ఫ్లోరిన్‌, బ్రోమిన్‌ 

2) క్లోరిన్‌, ఫ్లోరిన్‌

3) ఫ్లోరిన్‌, ఆర్సెనిక్‌ 

4) ఆర్సెనిక్‌, అమ్మోనియా

27. ఆర్సెనిక్‌ మన శరీరంలో అధికంగా చేరడం వల్ల కలిగే వ్యాధి?

1) మూత్రపిండాల వైఫల్యం

2) బ్లాక్‌ఫుట్‌ వ్యాధి

3) రక్తపోటు 

4) యూరిమియా

28. జపాన్‌లో ఏ కాలుష్యం వల్ల ఇటాయ్‌ - ఇటాయ్‌ వ్యాధి కలిగింది?

1) యురేనియం 

2) కాడ్మియం  

3) పాదరసం

4) సెలీనియం

29. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం తాగునీటిలో ఎంతకంటే ఎక్కువ పరిమాణంలో ఫ్లోరిన్‌ ఉంటే ఫ్లోరోసిస్‌ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది?

1) 10 PPM

2) 5 PPM 

3) 1.-5 PPM కంటే ఎక్కువ  

4) 1 PPM కంటే ఎక్కువ

30. తాగునీటి ద్వారా నైట్రేట్‌లు మన శరీరంలోకి చేరడం వల్ల కలిగే వ్యాధి?

1) మినమాటా          

2) మెట్‌ హీమోగ్లోబీనిమియా

3) సికిల్‌సెల్‌ ఎనీమియా

 4) థలసేమియా

31. బయోమాగ్నిఫికేషన్‌ ప్రక్రియను ఏమని పిలుస్తారు?

1) బయోలాజికల్‌ మాగ్నిఫికేషన్‌

2) బయోలాజికల్‌ ఆంప్లిఫికేషన్‌

3) ఫుడ్‌ చైన్‌ కాన్సంట్రేషన్‌

4) పైవన్నీ

32. భార లోహాలు, డీడీటీ, ఆల్‌డ్రిన్‌ లాంటి రసాయనాలు ఆహారపు గొలుసులోని వివిధ పోషక స్థాయుల్లో జమ కూడటాన్ని ఏమంటారు?

1) యూట్రోఫికేషన్‌

2) బయోమాగ్నిఫికేషన్‌

3) బయోమానిప్యులేషన్‌  

4) ఫుడ్‌ చైన్‌ మాడిఫికేషన్‌

33. సేంద్రియ, నిరేంద్రియ (inorganic) పదార్థాలు కొలనులో చేరడం వల్ల పోషక పదార్థాల గాఢత పెరగడాన్ని ఏమంటారు?

1) న్యూట్రియంట్‌ మాడిఫికేషన్‌  

2) బయోమాగ్నిఫికేషన్‌

3) యూట్రోఫికేషన్‌

4) ఒలిగో ట్రోఫికేషన్‌


34. జల ఆవరణ వ్యవస్థల్లో యూట్రోఫికేషన్‌ జరగడానికి కారణాలు?

1) మురుగునీరు        

2) వ్యవసాయంలో వాడే రసాయనాలు

3) పారిశ్రామిక వ్యర్థ జలాలు

4) పైవన్నీ

35. ఏ రకమైన సరస్సులో నీరు తక్కువ   కలుషితమవుతుంది?

1) ఒలిగోట్రోఫిక్‌ సరస్సు  

2) యూట్రోఫిక్‌ సరస్సు

3) డిస్ట్రోఫిక్‌ సరస్సు  

4) మీసో ట్రోఫిక్‌ సరస్సు

36. యూట్రోఫికేషన్‌ జరగడం వల్ల సరస్సులో ఎలాంటి మార్పులు ఏర్పడతాయి?  

1) శైవల మంజురులు (Algal blooms) పెరుగుతాయి.

2) నీటిలో ఆక్సిజన్‌ గాఢత తగ్గుతుంది.

3) సరస్సులో జీవవైవిధ్యం తగ్గుతుంది.

4) పైవన్నీ


సమాధానాలు

1-4; 2-3; 3-4; 4-4; 5-3; 6-2; 7-1; 8-3; 9-1; 10-4; 11-1; 12-4; 13-2; 14-3; 15-4; 16-1; 17-4; 18-1; 19-2; 20-3; 21-1; 22-4; 23-2; 24-4; 25-1; 26-3; 27-2; 28-2; 29-3; 30-2; 31-4; 32-2; 33-3; 34-4; 35-1; 36-4. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని