కరెంట్‌ అఫైర్స్‌

2024 జనవరి 28న సుప్రీంకోర్టు డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలను ఎవరు ప్రారంభించారు?

Published : 19 Mar 2024 01:19 IST

మాదిరి ప్రశ్నలు

2024 జనవరి 28న సుప్రీంకోర్టు డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలను ఎవరు ప్రారంభించారు?

జ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ


సెంట్రల్‌ జియోలాజికల్‌ ప్రోగ్రామింగ్‌ బోర్డు (సీజీపీబీ) 63వ సమావేశాన్ని 2024 జనవరిలో ఎక్కడ నిర్వహించారు.

జ: భోపాల్‌


75వ భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు?

జ: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌


2024 భారత గణతంత్ర దినోత్సవాన్ని ఏ థీమ్‌తో నిర్వహించారు?

జ: వికసిత్‌ భారత్‌, భారత్‌ - లోక్‌తంత్ర్‌కి మాతృక


భారత దేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా హమారా సంవిధాన్‌, హమారా సమ్మాన్‌ ప్రచార కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?

జ: ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కడ్‌


కేంద్ర ప్రభుత్వ స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంటర్‌ప్రైన్యూర్‌షిప్‌ (ఎమ్‌ఎస్‌డీఈ) ఆధ్వర్యంలో దిల్లీలో నిర్మించిన కౌశల్‌ భవన్‌ను 2024 జనవరి 24న ఎవరు ప్రారంభించారు?  

జ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


మతపరమైన విభేదాలకు అతీతంగా ప్రజల మధ్య ఐక్యత, సద్భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఐఐసీఎఫ్‌ సంస్థ అయోధ్యలో ‘‘మస్జిద్‌ మహమ్మద్‌ బిన్‌ అబ్దుల్లా’’ అనే పేరుతో గ్రాండ్‌ మసీదును నిర్మిస్తున్నట్లు 2024 జనవరిలో ప్రకటించింది. ఐఐసీఎఫ్‌ పూర్తి రూపం ఏమిటి?

జ: ఇండో - ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌


భారతీయ భాషల్లో డిజిటల్‌ స్టడీ మెటీరియల్‌లను అందించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన ఆర్టిఫిషయల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌ యాప్‌ ఏది?

జ: అనువాదిని



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని