భూతాపాన్ని పెంచేస్తున్న వరి సాగు!

ప్రస్తుత ప్రపంచం ప్రాంతాలకు అతీతంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య శీతోష్ణస్థితి మార్పు. మానవ అభివృద్ధి పరిణామక్రమంలో చోటుచేసుకున్న పరిస్థితులు, జరిగిన ఆవిష్కరణలు, సరికొత్త జీవనశైలి, పెరిగిన వ్యవసాయం, సాంకేతిక వినియోగం లాంటివన్నీ సహజ వాతావరణాన్ని దెబ్బతీసి, భూతాపాన్ని పెంచేశాయి.

Updated : 23 Mar 2024 00:59 IST

జనరల్‌ స్టడీస్‌  పర్యావరణ అంశాలు

ప్రస్తుత ప్రపంచం ప్రాంతాలకు అతీతంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య శీతోష్ణస్థితి మార్పు. మానవ అభివృద్ధి పరిణామక్రమంలో చోటుచేసుకున్న పరిస్థితులు, జరిగిన ఆవిష్కరణలు, సరికొత్త జీవనశైలి, పెరిగిన వ్యవసాయం, సాంకేతిక వినియోగం లాంటివన్నీ సహజ వాతావరణాన్ని దెబ్బతీసి, భూతాపాన్ని పెంచేశాయి. ప్రకృతి సమతౌల్యత గతి తప్పి అనేక అనర్థాలు తలెత్తున్నాయి. ప్రధాన కాలుష్యకారక వాయువులు, వాటి ఉత్పత్తి కారకాలు, కర్బన ఉద్గారాలతో ఆవరణ వ్యవస్థల్లో ఎదురవుతున్న నష్టంపై అభ్యర్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. కాలుష్యం కారణంగా వస్తున్న వ్యాధులతో పాటు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా తెలుసుకోవాలి.

శీతోష్ణస్థితి మార్పు

ఒక భౌగోళిక ప్రాంతంలోని సగటు వాతావరణ స్థితిని దీర్ఘకాలికంగా లెక్కించగా వచ్చేదే ఆ ప్రాంత శీతోష్ణస్థితి. భూగోళ సగటు ఉష్ణోగ్రత 15.4ా సెంటీగ్రేడ్‌. అయితే మానవుడు అభివృద్ధి పేరిట చేపట్టే కార్యక్రమాల కారణంగా గ్రీన్‌హౌస్‌ వాయువులు వాతావరణంలోకి ఎక్కువగా విడుదలవుతున్నాయి. దీంతో గత 225 ఏళ్ల నుంచి స్థిర స్వభావం ఉన్న భూగోళ సగటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీన్నే శీతోష్ణస్థితిలో మార్పు అని పిలుస్తారు.

శిలాజ ఇంధనాలు ఎక్కువగా మండించడం, వ్యవసాయంలో ఎరువుల వాడకం లాంటి చర్యలతో విడుదలయ్యే ఏరోసాల్స్‌, క్లోరోఫ్లోరో కార్బన్లు గ్రీన్‌హౌజ్‌ రూపంలో భూమిపైకి వచ్చే ఉష్ణశక్తిని గ్రహించి బంధించడం వల్ల భూగోళ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శీతోష్ణస్థితి మార్పుల్లో ప్రధానమైనవి 1) ఆమ్ల వర్షాలు 2) ఓజోన్‌ క్షీణత 3) గ్లోబల్‌ వార్మింగ్‌ (భూతాపం)

మాదిరి ప్రశ్నలు

1. భూగోళ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కారణమేంటి?

1) కార్బన్‌ డై ఆక్సైడ్‌ నీటిఆవిరిలోని ఉష్ణాన్ని గ్రహించడం.
2) కార్బన్‌ డై ఆక్సైడ్‌ అతినీలలోహిత కిరణాలను గ్రహించడం.
3) భౌమ వికిరణ రూపంలోని పరారుణ కాంతిని గ్రహించడం
4) పైవన్నీ

2. కిందివాటిలో గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమైన గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో లేనిది ఏది?

1) CO2
2) CO
3) CH4
4) N2O

3. కింది గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో ట్రోపోస్ఫియర్‌ ప్రాంతంలో ఓజోన్‌ కాలుష్యకానికి కారణం కాని వాయువు?

1) మీథేన్‌
2) కార్బన్‌ మోనాక్సైడ్‌    
3) నైట్రోజన్‌ ఆక్సైడ్‌
4) నీటిఆవిరి

4. కిందివాటిని పరిశీలించి సరైనవాటిని గుర్తించండి.

ఎ) ఓజోన్‌ అధికంగా స్ట్రాటోస్ఫియర్‌ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుంది.
బి) ఓజోన్‌ పొర భూ ఉపరితలం నుంచి 55 - 75 కిలోమీటర్ల పైన కేంద్రీకృతమై ఉంటుంది.
సి)ఓజోన్‌ వాయువు సూర్యుడి నుంచి భూఉపరితలం వైపు ప్రసరించే అతినీలలోహిత కిరణాలను గ్రహిస్తుంది.
డి) భూమి మీద ఉండే జీవజాతి మనుగడ పరంగా ఓజోన్‌ వాయువు పాత్ర లేదు.

1) ఎ, బి   2) ఎ, సి   3) బి, సి   4) సి, డి

5. అంటార్కిటికా ప్రాంతంలో స్ట్రాటో ఆవరణంలో ఓజోన్‌ రంధ్రాన్ని ఎప్పుడు గుర్తించారు?

1) 1975
2) 1985
3) 1978
4) 1987

6. కిందివాటిని పరిశీలించండి.

ప్రతిపాదన (A): క్లోరోఫ్లోరో కార్బన్‌లు (CFCs) ఓజోన్‌ పొరను విచ్ఛిన్నం చేస్తాయి.
కారణం(R): క్లోరోఫ్లోరో కార్బన్‌లు (CFCs) క్లోరిన్‌, బ్రోమిన్‌, ఫ్లోరిన్‌ వాయవులతో నిర్మితమై ఉంటాయి.
1) A, R లు సరైనవి. A కి B సరైన వివరణ.
2) A, R లు సరైనవి. కి B సరైనవివరణ కాదు.
3) సరైంది, B సరైంది కాదు.
4) A సరైంది కాదు, B సరైంది.

7. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.

1) బాసల్‌ సదస్సు - జీవవైవిధ్య సంరక్షణ
2) మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ - గ్లోబల్‌ వార్మింగ్‌
3) క్యోటో ప్రొటోకాల్‌ - శీతోష్ణస్థితిలో మార్పులు
4) రామ్‌సర్‌ సదస్సు - భూగర్భజల కాలుష్యం

8. కిందివాటిలో ఏ జంట వాయువులు గ్లోబల్‌  వార్మింగ్‌కు అత్యధికంగా కారణమవుతున్నాయి?

1) కార్బన్‌ డయాక్సైడ్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌
2) కార్బన్‌ డయాక్సైడ్‌, మీథేన్‌
3) మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌
4) కార్బన్‌ డయాక్సైడ్‌, క్లోరోఫ్లోరో కార్బన్స్‌

9. ఓజోన్‌ రంధ్రం ఏర్పడటానికి కారణమైన అతి ప్రధాన దేశం?

1) రష్యా
2) జపాన్‌
3) అమెరికా
4) జర్మనీ

10. గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమైన గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో పూర్తిగా మానవ చర్యల వల్ల వాతావరణంలో చేరే గ్రీన్‌హౌస్‌ వాయువు ఏది?

1) క్లోరోఫ్లోరో కార్బన్స్
2) మీథేన్‌
3) నైట్రస్‌ ఆక్సైడ్‌
4) సల్ఫర్‌ హెక్సాఫ్లోరైడ్‌

11. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో వరి సాగు ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టడం వల్ల గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావానికి కారణమవుతుంది. కింది ఏ కారణాన్ని దీనికి ఆపాదించవచ్చు?

ఎ) వరి సాగు భూముల్లో అవాయు శ్వాసక్రియ   జరగడం వల్ల మీథేన్‌ వాయువు వాతావరణంలోకి విడుదలవుతుంది.
బి) పంటల పెరుగుదలకు నైట్రోజన్‌ సంబంధిత  ఎరువులను పంట భూముల్లో ఎక్కువగా పిచికారీ చేయడం వల్ల వాతావరణంలోకి నైట్రస్‌ ఆక్సైడ్‌ విడుదలవుతుంది.
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే  
3) ఎ, బి లు రెండూ సరైనవే    
4) ఎ, బి లు రెండూ సరికాదు

12. కిందివాటిలో ఆమ్ల వర్షాలకు కారణమైన కాలుష్యకాలు ఏవి?

1) నైట్రోజన్‌, సల్ఫర్‌ ఆక్సైడ్‌లు
2) కార్బన్‌ డయాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌
3) ఓజోన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌
4) కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌

13. Bad Ozone అంటే...

1) ట్రోపో ఆవరణ ప్రాంతంలో ఓజోన్‌ పరిమాణం తక్కువగా ఉండే స్థితి.
2) స్ట్రాటో ఆవరణ ప్రాంతంలో ఓజోన్‌ పరిమాణం తక్కువగా ఉండే స్థితి.
3) ట్రోపో ఆవరణ ప్రాంతంలో ఓజోన్‌ పరిమాణం పరిమితి కంటే ఎక్కువగా ఉండే స్థితి.
4) మీసో ఆవరణ ప్రాంతంలో ఓజోన్‌ పరిమాణం తక్కువగా ఉండే స్థితి.

14. Good Ozone అంటే...

1) ట్రోపో ఆవరణ ప్రాంతంలో ఓజోన్‌ పరిమాణం తక్కువగా ఉండే స్థితి.
2) స్ట్రాటో ఆవరణ ప్రాంతంలో ఓజోన్‌ పరిమాణం ఎక్కువ స్థాయిలో ఉండే స్థితి.
3) ట్రోపో ఆవరణ ప్రాంతంలో ఓజోన్‌ పరిమాణం పరిమితి కంటే ఎక్కువగా ఉండే స్థితి.
4) మీసో ఆవరణ ప్రాంతంలో ఓజోన్‌ పరిమాణం తక్కువగా ఉండే స్థితి.

15. కిందివాటిలో ఓజోన్‌ పొర క్షీణతకు కారణమైన వాయువులు?

1) క్లోరోఫ్లోరోకార్బన్లు, నైట్రిక్‌ ఆక్సైడ్‌
2) టెట్రా క్లోరోమీథేన్‌, మీథేన్‌ బ్రోమైడ్‌
3) పోలార్‌ స్ట్రాటోస్ఫియర్‌ క్లౌడ్స్‌
4) పైవన్నీ

16. కిందివాటిలో ఓజోన్‌ క్షీణత వల్ల కలిగే దుష్ప్రభావం ఏది?

1) అతినీలలోహిత కిరణాలు ఎక్కువ పరిమాణంలో భూమిపైకి చేరి మానవుడిలో కార్సినోమా,   మెలనోమా అనే చర్మక్యాన్సర్‌ వ్యాధులు రావడం, స్త్రీలలో రొమ్ము క్యాన్సర్‌, బ్లడ్‌ క్యాన్సర్‌, కాటరాక్ట్‌ అనే కంటి సంబంధ వ్యాధులు వస్తాయి.
2) మానవుల్లో కళ్లు మంటలెక్కుతాయి.
3) మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గి ఆహారోత్పత్తి, దిగుబడులు తగ్గిపోతాయి.
4) పైవన్నీ

17. కిందివాటిలో ప్రవాళభిత్తికల విక్షాళనానికి కారణం?

1) ప్రవాళభిత్తికల తవ్వకాలు
2) ప్రవాళాలపై వ్యాధులు విస్తరించడం
3) సముద్రపు నీటిలో పూడికలు ఎక్కువగా చేరడం
4) గ్లోబల్‌ వార్మింగ్‌

18. ఓజోన్‌ పొర క్షీణతను అరికట్టేందుకు UNO  ఆధ్వర్యంలో చేపట్టిన ఒప్పందాలకు సంబంధించి కింది పట్టికను జతపరచండి.

ఒప్పందం సంవత్సరం

1) వియన్నా కన్వెన్షన్‌   ఎ) 1985
2) మాంట్రియల్‌ కన్వెన్షన్‌ బి) 1987
3) లండన్‌ సదస్సు     సి) 1992
4) వియన్నా ఒప్పందం   డి) 1991
1) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి          
2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
3) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి        
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

19. కిందివాటిలో IPCC (Inter Governmental Pannel on Climate Change) ఏర్పాటులో ముఖ్యపాత్ర వహించిన అంతర్జాతీయ సంస్థలను గుర్తించండి.

ఎ) United Nations Environmental Programme (UNEP)
బి) World Trade Organisation (WTO)
సి) World Meterological Organisation (WMO)

1) ఎ, బి   2) ఎ, సి  3) బి, సి  4) ఎ, బి, సి

20. కిందివాటిలో గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం ఉందనేందుకు నిదర్శనాలు?

ఎ) వాతావరణపు గాలిలో ఉష్ణోగ్రతలు పెరగడం
బి) ఖండాంతర్గత, పర్వత హిమానీనదాలు కరగడం
సి) సమశీతోష్ణ, ధ్రువ ప్రాంతాలవైపు ఉష్ణమండల అంటువ్యాధులు విస్తరించడం

1) ఎ, బి   2) ఎ, సి  3) బి, సి 4) ఎ, బి, సి

21. కిందివాటిలో సరైనవాటిని గుర్తించండి.

ఎ) ఓజోన్‌ పొర ట్రోపోస్ఫియర్‌ పై సరిహద్దులో కేంద్రీకృతమై ఉంటుంది.
బి) భూగ్రహాన్ని ఓజోన్‌ పొర ఒక గొడుగులా, రక్షణా కవచం మాదిరి పరిరక్షిస్తుంది.

1) ఎ మాత్రమే   2) బి మ్రాతమే  
3) రెండూ సరైనవి   4) రెండూ సరికాదు

22. కిందివాటిని పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ్శ క్యోటో ప్రొటోకాల్‌లోని ఆర్టికల్‌-6 ప్రకారం ‘పరిశుభ్రమైన అభివృద్ధి విధానం’ కింద అనుబంధం-1లోని ఒక దేశం, అనుబంధం-1లోని మరొక దేశంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కాలుష్య ఉద్గారాల యూనిట్‌లను పొందొచ్చు.
బి) ‘పరిశుభ్రమైన అభివృద్ధి విధానం’ కింద పొందిన కార్బన్‌ క్రెడిట్స్‌ను ‘కాలుష్య అనుమతి ఉద్గారాల తగ్గింపు యూనిట్స్‌ (దినిళిగీ()’ అని పిలుస్తారు.
సి) ఒక దినిళిగీ( ఒక టన్ను కార్బన్‌ డయాక్సైడ్‌కు సమానం.

1) ఎ, సి 2) బి మాత్రమే 3) ఎ, బి 4) ఏదీకాదు

23. డైమిథైల్‌ మెర్క్యురీ కాలుష్యకం కిందివాటిలో ఏ వ్యాధికి కారణమవుతుంది?

1) ఇటాయి - ఇటాయి  
2) బ్లూబేబీ సిండ్రోమ్‌
3) ఫ్లోరోసిస్‌
4) మినమాటా

సమాధానాలు

1-3; 2-2; 3-4; 4-2; 5-2; 6-3; 7-3; 8-2; 9-3; 10-1; 11-3; 12-1; 13-2; 14-2; 15-4; 16-4; 17-4; 18-4; 19-2; 20-4; 21-2; 22-4; 23-4.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని