Bank Jobs: ఐడీబీఐలో స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. భారీగా వేతనం!

IDBI Bank jobs: ఐడీబీఐలో స్పెషలిస్ట్ క్యాడర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు పొడిగించారు. ఈ నెల 20వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

Updated : 14 Jun 2023 16:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (IDBI)లో ఉద్యోగాల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. 136 స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి జూన్‌ తొలివారంలో మొదలైన దరఖాస్తులకు గడువు ఈ నెల 20తో ముగియనుంది. గతంలో జూన్‌ 1నుంచి 15వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసినప్పటికీ.. తాజాగా ఆ గడువును పొడిగిస్తూ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారు ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. పూర్తి వివరాలివే..

నోటిఫికేషన్‌లోని ముఖ్యాంశాలివే..

  • స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీల మొత్తం 136.  జూన్‌ 20వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
  • దరఖాస్తులను జులై 5 వరకు ప్రింట్‌ తీసుకోవచ్చు. 
  • బ్యాంకులోని వివిధ విభాగాల్లో 84 మేనేజర్‌ పోస్టులు, 46 అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, 6 డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ చొప్పున మొత్తం 136 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలన్నింటికీ గతంలో పనిచేసిన అనుభవం తప్పనిసరి. 
  • ఈ నోటిఫికేషన్లలో పేర్కొన్న ఉద్యోగాలకు హోదాలను బట్టి నెలకు వేతన స్కేలు ఆయా పోస్టుల హోదాలను బట్టి నెలకు కనిష్ఠంగా రూ.48,170 నుంచి గరిష్ఠంగా రూ.1.55లక్షల వరకు ఉంది. ఈ పోస్టులకు విద్యార్హతలు, వేతనం, అనుభవం, ఎంపిక విధానం, పరీక్ష, కనీస వయసు, దరఖాస్తు రుసుం తదితర వివరాలను ఈ కింద పేర్కొన్న నోటిఫికేషన్ల ద్వారా తెలుసుకోండి.

స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి

దరఖాస్తు చేసుకొనేందుకు ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని