UPSC recruitment: 113 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. ఏయే పోస్టులంటే?

UPSC recruitment: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీచేసేందుకు UPSC నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

Published : 12 Jun 2023 18:20 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి యూపీఎస్సీ(UPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ సర్జన్‌/మెడికల్‌ ఆఫీసర్‌, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ III సహా పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 113 పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు జూన్‌ 29 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల వారీగా దరఖాస్తు చేసుకొనేందుకు https://upsconline.nic.in/ora/VacancyNoticePub.php క్లిక్‌ చేయండి

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

  • అర్హులైన అభ్యర్థులు జూన్‌ 29 రాత్రి 11.59గంటల వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చు.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తును ప్రింట్‌ తీసుకొనేందుకు జూన్‌ 30 రాత్రి 23.59గంటల వరకు అవకాశం ఉంటుంది. ఇంటర్వూకు షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను తమ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు రుసుం: మహిళలు/ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు మినహా మిగతా అభ్యర్థులందరికీ రూ.25 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
  •  యూపీఎస్సీ వెబ్‌సైట్‌ upsconline.nic.inని సందర్శించి అక్కడ OTR లింక్‌పై క్లిక్‌ చేసి తమ ప్రొఫైల్‌ను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తాము ఎంచుకున్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆయా విభాగాల వారీగా పోస్టులు ఎన్నెన్ని? విద్యార్హతలేంటి, వయో పరిమితి, అనుభవం, పే స్కేలు తదితర వివరాలన్నీ ఈ కింది నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

పూర్తి నోటిఫికేషన్‌ ఇదే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని