JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్‌ కార్డుల విడుదల

JEE Advanced Admit Cards: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. వెబ్‌సైట్లో అడ్మిట్‌ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. జూన్‌ 4న పరీక్ష జరగనుంది.

Updated : 29 May 2023 13:28 IST

గువాహటి: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ (IITs)ల్లో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష (JEE Advanced Exam)కు సంబంధించి అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. జూన్‌ 4న నిర్వహించనున్న ఈ పరీక్షకు ఐఐటీ గువాహటి (IIT Guwahati) ఏర్పాట్లు చేస్తోంది. జేఈఈ మెయిన్‌ (JEE Main)లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్‌ 30 నుంచి మే 7 వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న విషయం తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కొక్కటీ మూడు గంటల వ్యవధి ఉంటుంది. పేపర్‌-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు; పేపర్‌- 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. రెండు పేపర్లూ రాయడం తప్పనిసరి.

అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని