JEE Main Admit cards: జేఈఈ మెయిన్‌ (సెషన్‌ 2) అడ్మిట్ కార్డులు విడుదల

JEE Main 2023: జేఈఈ మెయిన్‌ (సెషన్‌2) పరీక్షకు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. ఈ నెల 6 నుంచి జరిగే ఈ సెషన్‌ పరీక్షలను దేశ వ్యాప్తంగా 9.4లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

Updated : 10 Apr 2023 12:56 IST

దిల్లీ: దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ (JEE Main 2023) సెషన్‌ -2కు సంబంధించి అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.  ఈ నెల 6 నుంచి జరగనున్న ఈ పరీక్షలకు అడ్మిట్‌ కార్డుల్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) సోమవారం సాయంత్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు www.nta.ac.in, https://jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్ల నుంచి తమ అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 330 సిటీల్లో ఏప్రిల్‌ 6,8,10,11,12,13, 15 తేదీల్లో జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. అలాగే, విదేశాల్లోని 15 నగరాల్లోనూ ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను 9.4లక్షల మందికి పైగా విద్యార్థులు రాయనున్నారు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి అడ్మిట్‌ కార్డును పొందొచ్చు.

అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

ఒకవేళ జేఈఈ మెయిన్‌ (సెషన్‌ 2) అడ్మిట్‌కార్డును పొందడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే విద్యార్థులు NTA హెల్ప్‌లైన్‌ నంబర్‌ 011-40759000 నంబర్‌ను ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించవచ్చు. మరోవైపు, జేఈఈ మెయిన్‌లో టాప్‌ స్కోరు సాధించే 2,50,000 మంది విద్యార్థులు  జూన్‌ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని