LIC ADO Results: ఎల్‌ఐసీలో 9,394 పోస్టులు.. ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు చెక్‌చేసుకోండి!

LIC ADO ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కింద ఇచ్చిన లింక్‌లో పరీక్షకు అర్హత సాధించిన వారి వివరాలు తెలుసుకోవచ్చు.

Published : 10 Apr 2023 15:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఎల్‌ఐసీ(LIC) కార్యాలయాల్లో  అప్రెంటిస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(ఏడీవో) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జోన్‌ల వారీగా మొత్తం 9,394 ఏడీవో పోస్టులను భర్తీ చేసేందుకు జనవరిలో భారీ నోటిఫికేషన్‌ జారీ అయిన విషయం తెలిసిందే. వీటిలో సౌత్‌ సెంట్రల్‌ జోనల్‌ ఆఫీస్‌ (హైదరాబాద్‌) పరిధిలోనే 1,408 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ కోసం మార్చి 12న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. సోమవారం జోన్‌ల వారీగా ఫలితాలను పీడీఎఫ్‌ రూపంలో అందుబాటులో ఉంచారు. ప్రిలిమ్స్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులంతా ఏప్రిల్‌ 23న జరిగే మెయిన్స్‌ పరీక్షను రాయాల్సి ఉంటుంది. మెయిన్‌లోనూ అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ, ప్రీ-రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ పరీక్ష నిర్వహించి ఆ తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు.

జోన్‌ల వారీగా ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని