Bank Jobs: సెంట్రల్ బ్యాంకులో 1000 మేనేజర్ ఉద్యోగాలు.. భారీగా వేతనం

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో భారీగా మేనేజర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు.

Published : 03 Jul 2023 05:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Central Bank of India)లో భారీగా మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌-2 మేనేజర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది.  హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ రెగ్యులర్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జులై 15లోపు https://ibpsonline.ibps.in/cbimmjun23/  వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

  • పోస్టు వివరాలు: మేనేజర్ (మెయిన్ స్ట్రీమ్)- మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-2
  • అర్హత: ఏదైనా డిగ్రీ. సీఏఐఐబీ ఉత్తీర్ణులై ఉండాలి. పీఎస్‌బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌/ ఆర్‌ఆర్‌బీలో ఆఫీసర్‌గా మూడేళ్ల పని అనుభవం. లేదా పీఎస్‌బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌/ ఆర్‌ఆర్‌బీలో క్లర్క్‌గా ఆరేళ్ల పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో ఎంబీఏ/ ఎంసీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 
  • వయో పరిమితి: మే 31 2023 నాటికి 32 ఏళ్లు మించరాదు.
  • పే స్కేల్: నెలకు రూ.48,170-రూ.69,810.
  • ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 
  • దరఖాస్తు ఫీజు: ₹850; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ₹175
  • ఆన్‌లైన్ పరీక్ష ఆగస్టు రెండు/ మూడో వారంలో ఉండొచ్చు.

పూర్తి నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని