TS News: వైద్య కళాశాలల్లో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఫైనల్ మెరిట్ జాబితా ఇదిగో!
తెలంగాణలోని వైద్య కళాశాలల్లో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ జాబితా విడుదలైంది.
హైదరాబాద్: తెలంగాణలో తొమ్మిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియమించేందుకు 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది మెరిట్ జాబితా విడుదలైంది. ఈ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) సోమవారం ప్రకటించింది. మొత్తం 34 స్పెషాలిటీల్లో విడివిడిగా జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లో వెల్లడించారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్నది సీఎం కేసీఆర్ విజన్ అన్నారు. దీంట్లో భాగంగానే ఈ నియామక ప్రక్రియ కేవలం ఐదు నెలల వ్యవధిలోనే పారదర్శకంగా పూర్తి చేసినట్టు తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంపికైన వైద్యులందరికీ కంగ్రాట్స్ చెప్పారు. అలాగే, ఈ నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు కృషిచేసిన రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులను మంత్రి అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
బాబుకు మద్దతుగా ఉత్తరాల ప్రవాహం
-
Chandrababu: హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ ప్రారంభం
-
మనిషికి పంది గుండె.. రెండోరోజుకే చలోక్తులతో హుషారుగా ఉన్న రోగి!
-
రైలు పట్టాల కింద గుంత.. బాలుడి చొరవతో తప్పిన ప్రమాదం
-
పొత్తుకు తూట్లు పొడిచేలా ఎవరూ మాట్లాడొద్దు: నాగబాబు
-
కాలవ శ్రీనివాసులు దీక్ష భగ్నం