logo

‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం

కాల్చి పడేస్తా ఎవరు వస్తారో రమ్మనురా అంటూ సస్పెండైన  ఎస్సై వీరంగం సృష్టించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. భార్య భర్తల కేసు న్యాయస్థానంలో ఉండగా సస్పెన్స్‌లో ఉన్న ఓ ఎస్సై..

Updated : 30 Apr 2024 08:12 IST

తిరుపతిరావు సోదరుడు గోపిపై దౌర్జన్యం చేస్తున్న వెంకటయ్య

గుంటూరు రూరల్‌, న్యూస్‌టుడే: కాల్చి పడేస్తా ఎవరు వస్తారో రమ్మనురా అంటూ సస్పెండైన  ఎస్సై వీరంగం సృష్టించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. భార్య భర్తల కేసు న్యాయస్థానంలో ఉండగా సస్పెన్స్‌లో ఉన్న ఓ ఎస్సై.. భర్త ఉంటున్న ఊరెళ్లి అతడి కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అదేమని ప్రశ్నిస్తే దుర్భషలాడటంతో పాటు వారిపై చేయి చేసుకున్నాడు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం 75 తాళ్లూరుకు చెందిన గంటా తిరుపతిరావుకు గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన సింధూరతో 2013లో వివాహం జరిగింది. 2022లో వీరి మధ్య విభేదాలు రావడంతో అప్పటి నుంచి సింధూర గుంటూరులోని పుట్టింటిలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విడాకులు ఇప్పించాలని ఆమె భర్త న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టులో కేసు కొనసాగుతుంది. ఈ క్రమంలో సింధూర కుటుంబ సభ్యులు తెలిసిన వారి ద్వారా సస్పెండైన ఎస్సై వెంకటయ్యను కలిశారు. సదరు ఎస్సై నల్లపాడు పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహించే సమయంలో 2023 సెప్టెంబర్‌ 30న ఓ కేసులో తన ఇంటిలో లంచం తీసుకుటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి అరెస్టు చేసి సస్పెండ్‌ చేశారు. అప్పటి నుంచి ఎస్సై కొందరితో కలిసి ప్రైవేటు పంచాయితీలు చేస్తున్నాడు. సింధూర కేసు పరిష్కారం చేస్తానని చెప్పి ఆమె తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం గుంటూరు నుంచి 10 మందిని తీసుకెళ్లి తిరుపతిరావు ఇంటి వద్ద వీరంగం సృష్టించాడు. అక్కడే మద్యం తాగి మత్తులో అడ్డువచ్చిన వారిని దుర్భషలాడాడు. తుపాకీతో ఒక్కొక్కడిని కాల్చి పడేస్తా అంటూ బెదిరించాడు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు భయపడి పక్కకు వెళ్లారు. అదే సమయంలో ఇంటిలో ఉన్న సామన్లు అన్నింటిని ఆటోలో వేసుకుని గుంటూరు తరలించాడు. తిరుపతిరావు రపతయ్య సోదరుడు గంటా గోపి ఎస్సై దౌర్జన్యంపై ఇంటిలో సామానుతో పాటు బంగారం, నగదు ఎత్తుకెళ్లారని పెదకూరపాడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని