Bank Jobs: భారతీయ రిజర్వ్ బ్యాంకులో 291 ఉద్యోగాలు.. వివరాలివే..

RBI Job Recruitment: ఆర్‌బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడులైంది. పూర్తి వివరాలివే..

Updated : 26 Apr 2023 16:20 IST

ముంబయి: దేశ వ్యాప్తంగా ఆర్‌బీఐ(RBI) శాఖల్లో కొన్ని ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) సర్వీస్‌ బోర్డు 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు మే 9 నుంచి జూన్‌ 9 సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. 

పోస్టుల వివరాలివే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మే 9న ప్రారంభమవుతుంది.
  • ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)- జనరల్: 222 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్)- డీఈపీఆర్  38; ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్)- డీఎస్‌ఐఎం పోస్టులు 31చొప్పున ఖాళీగా ఉన్నట్టు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 
  • అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 
  • ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష (ఫేజ్ 1, 2), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా..
  • పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్‌) జనరల్- ఫేజ్ 1 ఆన్‌లైన్ పరీక్ష జులై 9న జరగనుండగా.. ఫేజ్ 2 పరీక్ష జూలై 30న నిర్వహించనున్నారు.  అలాగే, ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్‌) డీఈపీఆర్‌- ఫేజ్ 1 పరీక్ష జులై 16న; ఫేజ్‌ 2 పరీక్ష సెప్టెంబర్‌ 9న నిర్వహిస్తారు. ఇకపోతే,  ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్‌)- డీఎస్‌ఐఎం- ఫేజ్ 1 పరీక్షజులై 16న; ఫేజ్‌ 2 పరీక్షను ఆగస్టు 19న నిర్వహించనున్నారు. 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని