Apply Now: ఇంటర్‌తో 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

ఇంటర్‌ అర్హతతో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు సమీపిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated : 22 Sep 2023 19:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంటర్‌ అర్హతతో పోలీస్‌ ఉద్యోగంలో చేరాలనుకొనే వారికి అలర్ట్‌. దిల్లీ పోలీసు విభాగంలో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 7,547 కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌) ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్‌ 1 నుంచి మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 30వరకు ఆన్‌లైన్‌లో https://ssc.nic.in/ దరఖాస్తులు చేసుకోవచ్చు. డిసెంబర్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే.. 

  • మొత్తం 7,547 కానిస్టేబుల్‌ పోస్టులకు గాను పురుషుల విభాగంలో 5,056; మహిళలు విభాగంలో 2,491 చొప్పున ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అర్హత 10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ (LMV) ఉండాలి.
  • వేతనం: పే లెవల్-3 (₹21,700-₹69,100)
  • దరఖాస్తు రుసుం: రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మినహాయింపు)
  • ఎంపిక ప్రక్రియ:  కంప్యూటర్ ఆధారిత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు (పీఈటీ/ పీఎంటీ), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా..
  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉంటుంది. జీకే/కరెంట్‌ అఫైర్స్‌ 50 ప్రశ్నలకు 50 మార్కులు; రీజనింగ్‌ 25 ప్రశ్నలకు 25 మార్కులు; న్యూమరికల్‌ ఎబిలిటీ 15 ప్రశ్నలకు 15 మార్కులు, కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, ఇంటర్నెట్‌, వెబ్‌ బ్రౌజర్స్‌ 10 ప్రశ్నలకు 10 మార్కుల చొప్పున ఉంటాయి. మొత్తం 90 నిమిషాల పాటు పరీక్ష జరగనుంది. 
  • పరీక్ష ఇంగ్లిష్‌, హిందీలో మాత్రమే ఉంటుంది. ఒక్కో తప్పు సమాధానానికి పావు మార్కు చొప్పున కోత ఉంటుంది. 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని