కాలి సిరలు ఉబ్బితే?
కాలి సిరలు ఉబ్బితే (వెరికోజ్ వీన్స్) వాటిని తొలగించు కోవటం ఒక్కటే పరిష్కారం. స్క్లీరోథెరపీ, లేజర్ థెరపీ, అలాగే సర్జరీతో సిరలను మూసేయటం లేదా తీసేయటం వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
కాలి సిరలు ఉబ్బితే (వెరికోజ్ వీన్స్) వాటిని తొలగించు కోవటం ఒక్కటే పరిష్కారం. స్క్లీరోథెరపీ, లేజర్ థెరపీ, అలాగే సర్జరీతో సిరలను మూసేయటం లేదా తీసేయటం వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే అదృష్టం కొద్దీ చాలామందికి ఇలాంటి చికిత్సల అవసరం ఉండదు. బిగుతు సాక్స్ ధరించటం వంటి చిట్కాలతోనూ మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ సాక్స్ సిరలు ఉబ్బకుండా అదిమి పడతాయి. వీటిని రోజంతా ధరిస్తే నొప్పి, పొడుస్తున్నట్టు అనిపించటం, చిరచిర వంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఒకప్పుడు వీటిని ధరించటం నామోషీగా భావించేవారు. ఇప్పుడు రకరకాల రంగుల్లో లభిస్తుండటంతో ఎంతోమంది ధరిస్తున్నారు. ఆకర్షణీయంగానూ కనిపిస్తున్నాయి.
- పీచు, పొటాషియం, ఫ్లేవనాయిడ్లతో కూడిన ఆహారం తినటమూ మేలు చేస్తుంది. కూరగాయలు, పండ్లకు రంగును తెచ్చిపెట్టే ఫ్లేవనాయిడ్లు రక్తపోటు తగ్గటానికి తోడ్పడతాయి. ఇలా పరోక్షంగా సిరల ఉబ్బు తగ్గటానికీ దోహదం చేస్తాయి.
- కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కాళ్లు ఎత్తుగా ఉండేలా చూసుకోవటం మంచిది. గోడకు కాస్త దగ్గరగా వెల్లకిలా పడుకొని, కాళ్లను గోడకు ఆనించి పైకి లేపి, కాసేపు అలాగే ఉన్నా మేలే. గుండె కన్నా కాళ్లు ఎత్తుగా ఉన్నప్పుడు గురుత్వాకర్షణ ప్రభావంతో సిరలు రక్తాన్ని పైకి నెట్టటానికి వీలవుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Bhuvaneswari: నాన్న జ్ఞాపకాలతో నా హృదయం నిండిపోయింది: నారా భువనేశ్వరి ట్వీట్
-
Disease X: ‘డిసీజ్ ఎక్స్’ ముప్పు.. దొంగ వస్తాడని భయపడటం లాంటిదే..!
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Chiranjeevi: ఛారిటబుల్ ట్రస్ట్‌కు 25 ఏళ్లు.. చిరంజీవి ఆసక్తికర పోస్ట్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Festival shopping: మెగా సేల్స్‌కు రెడీనా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..