రికార్డుల ‘శిఖరం’!
పిల్లలూ.. ఏడేళ్ల వయసులో మనం బడికి వెళ్తాం.. టీవీ చూస్తూ, గేమ్స్ ఆడుతూ సరదాగా గడిపేస్తుంటాం కదా! కానీ, ఓ బాలుడు మాత్రం ఏకంగా ప్రపంచ రికార్డే సాధించాడు. అతడెవరో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!!
హైదరాబాద్‌కు చెందిన తేలుకుంట్ల విరాట్ చంద్రకి ప్రస్తుతం ఏడు సంవత్సరాలు. ఆఫ్రికా ఖండంలోనే ఎత్తయిన, సముద్రమట్టానికి 5,895 మీటర్ల ఎగువన ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ప్రపంచంలో చిన్న వయసు వ్యక్తిగా రికార్డు సాధించాడు.
సోదరుల వీడియో కాల్‌తో..
విరాట్ ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ పాఠశాలలో రెంతో తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజుల క్రితం విరాట్ పెద్దమ్మ కొడుకులు ఉత్తరాఖండ్‌లోని ఓ పర్వతం ఎక్కారు. అక్కడి నుంచి తమ్ముడు విరాట్‌కు వీడియో కాల్ చేసి.. అక్కడి పరిసరాలను చూపిస్తూ, విశేషాలు వివరిస్తూ మాట్లాడారు. దాంతో విరాట్‌కు కూడా పర్వతారోహణపై ఆసక్తి కలిగింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. మొదట్లో వారు వద్దని వారించారు.
కొద్ది రోజుల శిక్షణతోనే..
విరాట్ తన తల్లిదండ్రులను ఎలాగోలా పర్వతారోహణ శిక్షణకు ఒప్పించాడు. సోదరులు శిక్షణ పొందిన సంస్థలోనే విరాట్‌నూ చేర్పించారు. అక్కడ కేవలం నెలన్నర సాధనలోనే అద్భుత ప్రతిభ కనబరిచాడు. ప్రతి రోజూ కచ్చితంగా శిక్షణ తరగతులకు హాజరయ్యేవాడు. కోచ్ పర్యవేక్షణలో నిత్యం ఆరు కిలోమీటర్ల పరుగు, యోగా చేయడం, పర్వతాలు ఎక్కడం చేస్తుండేవాడు. అయిదు కిలోమీటర్ల మారథాన్‌లోనూ విరాట్ పాల్గొన్నాడంట.
శిఖరంపై జాతీయ జెండా
శిక్షణ అనంతరం మార్చి మొదటి వారంలో కిలిమంజారో పర్వతారోహణకు విరాట్ బయలుదేరాడు. సముద్రమట్టానికి 3,700 మీటర్ల ఎత్తు వరకు తల్లిదండ్రులు అతడి వెంట వెళ్లారు. అక్కడి నుంచి శిక్షకుడు, విరాట్ మాత్రమే శిఖరం దిశగా ముందుకు కదిలారు. మధ్యలో విపరీతమైన మంచు, బలమైన గాలులకు కొంత ఇబ్బంది పడినట్లు అతడు చెబుతున్నాడు. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ గంటల వ్యవధిలోనే విరాట్ కిలిమంజారో శిఖరం చేరుకొని జాతీయ జెండాను ఎగరేశాడు.
ప్రతి రోజూ వ్యాయామం
తనకు క్రికెట్ ఆడటం, స్కేటింగ్ అంటే ఇష్టమని విరాట్ చంద్ర చెబుతున్నాడు. ప్రతి రోజూ ఉదయాన్నే ఆరు కిలోమీటర్లు పరుగెత్తుతాడట. తర్వాత వ్యాయామంతో పాటు యోగా చేస్తాడు. ఏడేళ్లకే ప్రపంచ రికార్డు సాధించిన విరాట్.. భవిష్యత్తులో మరింత గుర్తింపు సాధించాలని మనమూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం..!!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Karnataka polls: ఎన్నికల వేళ జేడీఎస్‌కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా!
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు