మూడుతలల డ్రాగన్‌ను చూశారా!
ఒక్క తల డ్రాగన్‌ను చూస్తేనే భయం వేస్తుంది కదా! మరి దీన్ని చూశారా? ఏకంగా మూడు తలలతో ఉంది. అందులోనూ మంటలు కక్కుతూ ఎంత భయంకరంగా ఉందో కదా! ఇంతకీ ఇదెక్కడుంది? ఎందుకలా మంటలు వదులుతుంది? ఇవన్నీ తెలియాలంటే చదివేయండి..
నేస్తాలూ ఇది నిజమైన డ్రాగన్ కాదు. అచ్చు అలాగే కనిపిస్తున్న మూడు తలల డ్రాగన్ బొమ్మ. ఇది రష్యాలోని కామెంకా అనే ఊళ్లో కుడికిన గోరా అనే ఓ పెద్ద పార్కుంది. ఆ పార్కు మధ్యలో ఈ డ్రాగన్ బొమ్మను పెట్టారన్నమాట. అక్కడకు మొదటిసారి వెళ్లినవాళ్లు.. ఇంకా హఠాత్తుగా చూసిన వారు ఎవరైనా దీన్ని నిజం డ్రాగన్ అనుకుంటారు.
రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం..
ఉక్రెయిన్‌కు చెందిన వ్లాదిమిర్ కొలెస్నికోవ్ అనే శిల్పి.. 50 అడుగుల పొడవైన ఈ మూడు తలల డ్రాగన్‌ను రూపొందించాడు. దీన్ని ఇనుము, కాంక్రీట్‌తో తయారుచేశాడట. అన్నట్టు ఈ డ్రాగన్‌ను తయారుచేయడానికి ఆయనకు రెండు సంవత్సరాలు పట్టిందట. మరి అంతలా కష్టపడి చేయబట్టే ఈరోజున దాన్ని చూడ్డానికి వేలమంది పర్యాటకులు అక్కడకు వస్తున్నారు.
నిప్పులు కక్కేలా...
ఈ పార్క్‌లో నిర్వాహకులు పర్యాటకుల్ని పెంచడం కోసమే దీన్ని ఏర్పాటుచేశారు. అయితే మామూలుగా ఉంటే అంత ప్రత్యేకత ఏముందని అనుకుంటారు కదా! అందుకే.. ఈ డ్రాగన్ నోట్లో మంటలు వచ్చేలా ఏర్పాటుచేశారు. ఆ మంటలు వస్తున్న సమయంలో గాడ్జిల్లాలా అరుపు కూడా వినిపిస్తుంటుంది. దాంతో అక్కడకు వచ్చిన పిల్లలంతా ఆ బొమ్మ నిజమైన డ్రాగనేమో అనుకుంటారు. అంతేకాదండోయ్. అలా పెట్టడం వల్ల సందర్శకుల సంఖ్య కూడా పెరిగిందట. ఇక అంతే! జాతీయ సెలవు దినాలప్పుడల్లా ఈ విధమైన ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఫొటోలు తీసి కొంతమంది సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్ అయి అందరికీ తెలిసిందన్నమాట. ఇవీ ఈ బొమ్మ డ్రాగన్ విశేషాలు..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Parliament: ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం
-
India News
Aadhaar-PAN: ఆధార్-పాన్ లింకు డెడ్‌లైన్ పొడిగించండి.. మోదీకి కాంగ్రెస్ లేఖ
-
Sports News
Venkatesh Prasad: కేఎల్ రాహుల్ పట్ల నేను కఠినంగా ప్రవర్తించలేదు : వెంకటేశ్ ప్రసాద్
-
World News
చైనా చొరబాటుపై అమెరికా ముందే చెప్పిందా..? శ్వేతసౌధం స్పందన ఇదే..!
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ.. టీ20లు ఆడటం ఆపేయ్: షోయబ్ అక్తర్
-
India News
Death Penalty: ‘ఉరి’ విధానం క్రూరమైందా..? సుప్రీంకోర్టు ఏమంటోంది..!