నేనేం చేస్తానంటే!

హాయ్‌ ఫ్రెండ్స్‌! నేను ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నాను అంటే..  నన్ను అన్నం తినమంటే బాగా పేచీ పెడతాను. అమ్మ పాపం ఎంత బతిమాలుతుందో!

Published : 13 Jan 2022 01:06 IST

మారాం చేయను!

హాయ్‌ ఫ్రెండ్స్‌! నేను ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నాను అంటే..  నన్ను అన్నం తినమంటే బాగా పేచీ పెడతాను. అమ్మ పాపం ఎంత బతిమాలుతుందో! అందుకే ఇక మీదట మారాం చేయకుండా చక్కగా తింటాను. అమ్మ మాట వింటాను.  పొద్దున్నే లేచి మా మావయ్యతో కలిసి వ్యాయామం చేస్తాను. ఇప్పట్నుంచే చేస్తే ఆరోగ్యంగా ఉంటాం కదా! అలానే స్కూల్‌కు మానకుండా వెళతాను. బాగా చదువుకుని అమ్మానాన్నకు మంచి పేరు తెస్తాను. సమయం చిక్కినప్పుడల్లా అమ్మమ్మతో కాలక్షేపం చేస్తాను. తనతో కథలు చెప్పించుకుంటాను.

- ఎస్‌.జైమీ సందీప్‌ రాయ్‌, యూకేజీ, గుంటూరు  

నేస్తాలూ! మీరూ ఇలాగే 2022లో కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే అవేంటో చెబుతూ.. మీ పేరు, ఊరు, తరగతి మొదలైన వివరాలతో మాకు మెయిల్‌ చేయండి.

email : hai@eenadu.in

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని