నోరూరించే బాల్‌ మిఠాయి

ఉత్తరాఖండ్‌ వాసుల తియ్యటి వంటకం బాల్‌ మిఠాయి. ఇది గబుక్కున చూస్తే మన జీడీల్లా కనిపిస్తూ నోరూరిస్తుంది. దీన్ని చేసేందుకు.. ఖోయా 3 కప్పులు, పంచదార 2 కప్పులు, నెయ్యి చెంచా, గసగసాలు చారెడు కావాలి.

Updated : 19 May 2024 05:08 IST

త్తరాఖండ్‌ వాసుల తియ్యటి వంటకం బాల్‌ మిఠాయి. ఇది గబుక్కున చూస్తే మన జీడీల్లా కనిపిస్తూ నోరూరిస్తుంది. దీన్ని చేసేందుకు.. ఖోయా 3 కప్పులు, పంచదార 2 కప్పులు, నెయ్యి చెంచా, గసగసాలు చారెడు కావాలి. ఈ మిఠాయి ఎలా చేయాలంటే.. గసగసాలను వేయించి పక్కనుంచాలి. ఒక కప్పు పంచదారను అర కప్పు నీళ్లు పోసి చిక్కగా పాకం అయ్యాక దించేయాలి. పాన్‌లో చెంచా నెయ్యి, 3 కప్పుల ఖోయా వేసి లేత గోధుమ రంగులోకి మారే వరకూ వేడి చేయాలి. అందులో కప్పు పంచదార వేసి.. కలియ తిప్పుతుండాలి. రెండు నిమిషాల తర్వాత పంచదార పాకంలో ఒక పావు కప్పు చిన్న పాత్రలోకి తీసి.. మిగిలింది ఇందులో వేసి మూడు నిమిషాలు ఉడికించాలి. చిక్కబడి, ముదురు రంగు వచ్చేవరకూ ఉంచి, దించేయాలి. ఒక శుభ్రమైన ట్రేలో కుంచె సాయంతో నెయ్యి రాసి.. భోయా మిశ్రమాన్ని సమంగా సర్దాలి. కాస్త చల్లారాక.. నచ్చిన ఆకృతిలో ముక్కలు కోయాలి. దీర్ఘచతురస్రాల్లా ఉంటే బాగుంటాయి. వీటిని పాకంలో ముంచి తీసి.. వేయించిన గసగసాల్లో దొర్లించి తీస్తే సరి.. తియ్యతియ్యటి ‘బాల్‌ మిఠాయి’ తయారైపోతుంది. తిని ఆనందించడమే తరువాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని