ఈ పొంగనాలు.. అదుర్స్‌

ఎప్పుడూ ఇడ్లీ, వడ, ఉప్మా, దోశ, పెసరట్లేనా- అంటూ పిల్లలు పేచీ పెట్టడం, తినకుండా మారాం చేయడం మామూలే కదూ! వాళ్లలా విసిగించ కూడదంటే... మనమేవో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుండాలి.

Published : 07 Apr 2024 00:49 IST

ఎప్పుడూ ఇడ్లీ, వడ, ఉప్మా, దోశ, పెసరట్లేనా- అంటూ పిల్లలు పేచీ పెట్టడం, తినకుండా మారాం చేయడం మామూలే కదూ! వాళ్లలా విసిగించ కూడదంటే... మనమేవో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుండాలి. అలా ప్రయత్నించిందే సొరకాయ పొంగనాలు. దీనికి అవసరమైనవి అన్నీ ఇంట్లో అందుబాటులో ఉండేవే కనుక.. ప్రత్యేకంగా తెప్పించాల్సిన అవసరం ఉండదు. కష్టమైన వంటకం కూడా కాదు. ఎలాగంటే.. లేత సొరకాయను కడిగి.. చెక్కు తీసి, ముక్కలు తరగాలి. వాటికి రెండు పచ్చిమిరపకాయలు, అంగుళమంత అల్లం ముక్క, తగినంత ఉప్పు జత చేసి రుబ్బాలి. అందులో కప్పు ఉప్మారవ్వ, అర కప్పు పెరుగు, మూడు చెంచాల శనగపిండి కలిపి పావు గంట పక్కనుంచాలి. తర్వాత ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, నువ్వులు, వాము, కరివేపాకులతో తాలింపు వేసి, చారెడు కొత్తిమీర తరుగు కలపాలి. ఈ మిశ్రమంతో గుంత పొంగనాలు వేసి.. బంగారు రంగు వచ్చాక తీస్తే సరిపోతుంది. ప్రత్యేకమైన రుచీ, వాసన లతో సూపర్‌గా ఉంటాయి. పల్లీ లేదా కొబ్బరి పచ్చడితో వడ్డించామంటే.. ఇంట్లో అందరికీ నచ్చేస్తాయి.

 ఎం.ఎస్‌.లక్ష్మి, హైదరాబాద్‌


అన్నీ తెల్లగానే ఉంటాయి

కొబ్బరి, వెల్లుల్లి, క్యాలీఫ్లవర్‌, మష్రూమ్స్‌, యోగర్ట్‌, ముల్లంగి.. ఈ ఆరింటిలో ఉన్న సాధారణ గుణం తెలుసు కదా! అన్నీ తెల్లగానే ఉంటాయి. వీటన్నిటిలో ఉన్న ఇంకో మంచి లక్షణం రోగనిరోధకశక్తిని పెంచడం. కనుక వీటిని ఏదో రూపంలో తరచుగా తినండి, ఆరోగ్యంగా ఉండండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని