కరకరలాడే బిస్కెట్‌ భాకరీ

గుజరాతీల ప్రియమైన వంటకం బిస్కెట్‌ భాకరీ. ఇవెంత చూడముచ్చటగా ఉంటాయో అంత టేస్టీగా ఉంటాయి. వీటినెలా చేయాలంటే.. ఒక పాత్రలో కప్పున్నర గోధుమ పిండి, పావు కప్పు వేడి నూనె, పావు కప్పు నీళ్లు, రుచికి సరిపోయేంత ఉప్పు వేసి..

Published : 28 Apr 2024 00:40 IST

గుజరాతీల ప్రియమైన వంటకం బిస్కెట్‌ భాకరీ. ఇవెంత చూడముచ్చటగా ఉంటాయో అంత టేస్టీగా ఉంటాయి. వీటినెలా చేయాలంటే.. ఒక పాత్రలో కప్పున్నర గోధుమ పిండి, పావు కప్పు వేడి నూనె, పావు కప్పు నీళ్లు, రుచికి సరిపోయేంత ఉప్పు వేసి.. బాగా కలపాలి. మెత్తటి పిండి తయారయ్యాక.. ఓ పావుగంట పక్కనుంచాలి. నిమ్మకాయంత చొప్పున పిండిని తీసుకుని.. కాస్త మందమైన రొట్టె చేసి.. కటోరా గిన్నెతో నొక్కితే.. గుండ్రంగా వస్తుంది. తక్కిన పిండితోనూ ఇలాగే చేయాలి. అన్నీ తయారయ్యాక.. పెనం మీద నేతితో రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక్కో దఫా మూడు లేదా నాలుగు చొప్పున పడతాయి. మధ్యలో పప్పుగుత్తితో ప్రెస్‌ చేస్తే.. చక్కటి బిస్కెట్‌ ఆకృతిలోకి వస్తాయి. ఈ బిస్కట్‌ భాకరీలు ఒకసారి చేశారంటే.. పిల్లలు మళ్లీ మళ్లీ కావాలంటారు. అంత రుచిగా ఉంటాయి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని