ఛత్తీస్‌గఢ్‌ మిఠాయి దేహరోరీ

దేహరోరీ మిఠాయికి ఛత్తీస్‌గఢ్‌ పెట్టింది పేరు. ఇంటికెవరైనా అతిథులు వస్తే పది నిమిషాల్లో చేసేయొచ్చు. ఎక్కువ శ్రమా, పెద్దగా సరుకులూ అవసరం లేని ఈ సింపుల్‌ స్వీటు ఎలా చేయాలంటే..

Published : 14 Apr 2024 00:06 IST

దేహరోరీ మిఠాయికి ఛత్తీస్‌గఢ్‌ పెట్టింది పేరు. ఇంటికెవరైనా అతిథులు వస్తే పది నిమిషాల్లో చేసేయొచ్చు. ఎక్కువ శ్రమా, పెద్దగా సరుకులూ అవసరం లేని ఈ సింపుల్‌ స్వీటు ఎలా చేయాలంటే.. ఒక పాత్రలో బియ్యప్పిండి, ఉప్మా రవ్వ, పెరుగు కప్పు చొప్పున తీసుకుని బాగా కలిపి, రెండు గంటలు నాననివ్వాలి. ఒక పాత్రలో కప్పున్నర పంచదారతో పాకం తయారుచేసుకోవాలి. కడాయిలో నూనె కాగనిచ్చి.. కలిపిన పిండిని చెంచాతో చిన్న పకోడీల్లా వేసి గోధుమ రంగులోకి మారేదాకా వేయించాలి. ఇవి చిన్న పూర్ణాల్లా, చిట్టి బూరెల్లా చక్కగా ఉబ్బుతాయి. వీటిని పంచదార పాకంలో వేయాలి. అవి పాకం పీల్చుకోగానే తీసి మరో పాత్రలో వేయాలి. అంతే.. దేహరోరీ మిఠాయిలు తయారైపోతాయి. పైన డ్రైఫ్రూట్స్‌ పలుకులు చల్లితే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ వంటకం పిల్లలూ పెద్దలూ అందరికీ నచ్చేస్తుంది. బయటి స్వీట్లు కొనేకంటే ఇలా ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని