ఇది ఫ్రూట్‌ సమోసా తెలుసా!

ఉత్సాహం ఉరకలేస్తుంటే ఉన్నవాటితో సరిపెట్టాలనిపించదు. ఏవేవో కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అలా పుట్టుకొచ్చినవే పుచ్చకాయతో పాప్‌కార్న్‌, నూడుల్స్‌తో గులాబ్‌ జామూన్లు, ఆమ్లెట్‌ మోమోస్‌ లాంటివి

Updated : 31 Mar 2024 12:52 IST

ఉత్సాహం ఉరకలేస్తుంటే ఉన్నవాటితో సరిపెట్టాలనిపించదు. ఏవేవో కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అలా పుట్టుకొచ్చినవే పుచ్చకాయతో పాప్‌కార్న్‌, నూడుల్స్‌తో గులాబ్‌ జామూన్లు, ఆమ్లెట్‌ మోమోస్‌ లాంటివి. ఇప్పుడు కొత్తగా ‘ఫ్రూట్‌ సమోసా’ అంటూ ఓ వీడియో తెగ వైరలైంది. ఈ మాట వినగానే- సమోసా అనేది వేడి వేడిగా, కారంకారంగా బాగుంటుంది కానీ, ఇదేంటి- అని నుదురు చిట్లించారు కదూ! అసలు సంగతేమంటే.. మోటివేషనల్‌ స్పీకర్‌ గౌరవ్‌ ఖన్నా తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. అతడు కార్లో కూర్చుని- ‘నేనిప్పుడు న్యూదిల్లీ పశ్చిమ్‌ విహార్‌లో ఉన్నాను. ఎప్పుడూ పొటాటో స్టఫింగ్‌తోనే ఎందుకని.. ఫ్రూట్‌ సమోసా తినబోతున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం’ అంటూ సమోసా సగానికి తుంపేసరికి.. తీరా అందులో ఎప్పట్లా బంగాళదుంపల కూరే ఉంది. ‘చూశారా! సమోసాలు ఆలూతోనే చేస్తారు, పండ్లతో చేయరు. ఈ విషయం గురించి మీరు తెగ ఆలోచించి ఉంటారు కదూ.. ఇలా కొత్తగా ఆలోచించండి‘ అంటూ ముగించారు. ‘గౌరవ్‌ మోటివ్‌ గ్రూమ్‌’ పేరుతో ఇన్‌స్టాలో పోస్టయిన ఈ వీడియో విడుదలైన గంటలోనే లక్షకు పైగా లైక్స్‌ సొంతం చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు