ఇంగ్లండ్‌ చెఫ్‌ ఆలూ గోబీ చేసేశాడు!

క్యాలీఫ్లవర్‌తో- పకోడీ, ఊరగాయ పచ్చడి, ఇగురు, టొమాటోలు, బఠాణీలతో కూర.. ఏదైనా అదుర్సే. మరీ ముఖ్యంగా బంగాళదుంపలతో కలిపి వండితే ఇక చెప్పాల్సిందేముంది

Published : 07 Apr 2024 00:31 IST

క్యాలీఫ్లవర్‌తో- పకోడీ, ఊరగాయ పచ్చడి, ఇగురు, టొమాటోలు, బఠాణీలతో కూర.. ఏదైనా అదుర్సే. మరీ ముఖ్యంగా బంగాళదుంపలతో కలిపి వండితే ఇక చెప్పాల్సిందేముంది.. నాలుగు ముద్దలు ఎక్కువ తినేస్తాం. ఇంత పసందైన మన వంటకం విదేశీయులకీ తెగ నచ్చేస్తోంది. తాజాగా ఇంగ్లండ్‌లో చెఫ్‌, ఫుడ్‌ బ్లాగర్‌ అయిన జేక్‌ డ్రయాన్‌ ‘ఆలూ గోబీ’ కూర చేయడమే కాదు.. దాన్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడో లేదో 90 లక్షల వ్యూస్‌ వచ్చాయి. మన వాళ్లయితే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ జేక్‌ ఎలా చేశారంటే.. బంగాళదుంపల పొట్టు తీసి, ముక్కలు కోశారు. క్యాలీఫ్లవర్‌ను దాని ఆకులను చిన్నగా తరిగారు. పాలకూర, టొమాటోలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి.. అన్నీ తరిగి సిద్ధం చేశారు. అచ్చం మనలాగే కడాయిలో నూనె కాగనిచ్చి ఆవాలు, జీలకర్ర, ఇంగువలతో తాలింపు వేశారు. ఆనక.. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, తరిగిన కూరగాయలు, గరంమసాలా, కారం, పసుపు, ఉప్పు.. ఇలా ఒక దాని తర్వాత ఒకటి చొప్పున వేశారు. అన్నీ వేసి.. అంతా ఉడికాక చపాతీలతో వడ్డించారు. అచ్చం మనింట్లోనే చేసినట్లుంటే నచ్చకుండా ఉంటుందా మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని