మనింట్లో తమిళుల వంట!

సాంబార్‌ నుంచి పిండి వంటల వరకూ తమిళనాడు వాళ్లవి మహా రుచిగా ఉంటాయి కదూ! అందులోనూ ‘చెట్టినాడ్‌’ పేరు వింటే చాలు.. నోట్లో నీరూరుతుంది. మరి.. మన వంటలూ అలా ఉండాలంటే- చెట్టినాడ్‌ మసాలా పౌడర్‌ ఉంటే సరిపోతుంది.

Published : 28 Apr 2024 00:43 IST

సాంబార్‌ నుంచి పిండి వంటల వరకూ తమిళనాడు వాళ్లవి మహా రుచిగా ఉంటాయి కదూ! అందులోనూ ‘చెట్టినాడ్‌’ పేరు వింటే చాలు.. నోట్లో నీరూరుతుంది. మరి.. మన వంటలూ అలా ఉండాలంటే- చెట్టినాడ్‌ మసాలా పౌడర్‌ ఉంటే సరిపోతుంది. ఆ ఆ పౌడర్‌ను కూర, ఇగురు, బిర్యానీ.. ఎందులో వేసినా.. అదనపు రుచి వచ్చేస్తుంది. ఇంతకీ ఈ మసాలా ఎలా చేయాలంటే.. నాలుగు చెంచాలు ధనియాలు, 3 చెంచాలు సోంపు, ఆవాలు, గసగసాలు చెంచా చొప్పున, 2 చెంచాలు జీలకర్ర, అర చెంచా వాము, పావు చెంచా మెంతులు, 10 మిరియాలు, 3 యాలకులు, 4 లవంగాలు, 2 నల్ల యాలకులు, దాల్చినచెక్క అంగుళం ముక్క, స్టార్‌ మొగ్గ ఒకటి, 15 కశ్మీరీ ఎండు మిరపకాయలు, అర చెంచా బిర్యానీ పువ్వు, కొద్దిగా జాపత్రి, కరివేపాకు 4 రెబ్బలు తీసుకోవాలి. ఈ దినుసులన్నిటినీ కడాయిలో వేసి సన్న సెగ మీద మంచి వాసన వచ్చే దాకా వేయించాలి. ఇందుకు సుమారుగా పది నిమిషాలు పడుతుంది. వేగిన వాటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్‌లోకి తీసి.. మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ పొడిని తడి లేని, గాలి చొరబడని సీసాలో భద్రం చేసుకుంటే రెండు నెలల వరకూ వాడుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని