పిల్లలకూ నచ్చేస్తుంది మునగ చపాతీ!

ఆరోగ్యానికి మంచిదని మునక్కాడలు లేదా మునగాకుతో చారు చేస్తే.. పిల్లలు ససేమిరా తినరు. ఆ ఆకును పిండిలో కలిపి.. చపాతి చేశారనుకోండి.. వంక పెట్టకుండా తినేస్తారు.

Updated : 19 May 2024 05:04 IST

రోగ్యానికి మంచిదని మునక్కాడలు లేదా మునగాకుతో చారు చేస్తే.. పిల్లలు ససేమిరా తినరు. ఆ ఆకును పిండిలో కలిపి.. చపాతి చేశారనుకోండి.. వంక పెట్టకుండా తినేస్తారు. మునగ చపాతి ఎలా చేయాలంటే.. మునక్కాడలను ముక్కలు కోసి, ఉడికించి, పప్పుగుత్తితో మెత్తగా మెదపాలి. గుజ్జును ఉంచి, పిప్పిని తీసేయాలి. ఇందులో కప్పు గోధుమపిండి, అరకప్పు వేయించిన మునగాకు, రెండు చెంచాల కొత్తిమీర, చెంచా నూనె వేసి బాగా కలపాలి. దానికి కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, వేయించిన నువ్వులు జతచేయాలి. గుజ్జులో ఉన్న తడి సరిపోలేదంటే.. కొన్ని నీళ్లు చిలకరిస్తూ కలిపి పక్కన ఉంచాలి. అరగంట నాననిచ్చి చపాతీలు ఒత్తుకుని పెనం మీద నూనె లేదా నెయ్యితో కాల్చుకోవాలి. అంతే.. నోరూరించే మునగ చపాతీలు రెడీ. మునగలో ఐరన్, పొటాషియం, జింక్‌.. ఇలా శరీరానికి అవసరమైన పోషకాలు అనేకం ఉన్నాయి. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది, ఊబకాయం రానివ్వదు. రుచి మాత్రమే కాదు... కాకుండా ఇంత మేలు చేస్తుంది కనుక.. మీరూ ప్రయత్నించండి!

- జి.దేవి, తణుకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు