బంగాళదుంపలతో మసాలా ఇడ్లీలు!

రొటీన్‌గా చేసుకునే మినప్పిండి ఇడ్లీలకు భిన్నంగా బంగాళ దుంపలతో ఇడ్లీలు చేయొచ్చు తెలుసా? ఇవెంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఎలా చేయాలంటే..

Published : 09 Jun 2024 00:39 IST

రొటీన్‌గా చేసుకునే మినప్పిండి ఇడ్లీలకు భిన్నంగా బంగాళ దుంపలతో ఇడ్లీలు చేయొచ్చు తెలుసా? ఇవెంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఎలా చేయాలంటే.. ముందుగా 4 బంగాళదుంపలు చెక్కు తీసి, ముక్కలు కోసి జార్‌లో వేయాలి. మూడు పచ్చిమిర్చి, అంగుళమంత అల్లం ముక్క, చెంచా జీలకర్ర, పావు చెంచా పసుపు, పావు కప్పు నీళ్లు జోడించి గ్రైండ్‌ చేయాలి. అందులో ఇంకొన్ని నీళ్లు, కప్పున్నర ఉప్మారవ్వ, పావు కప్పు చొప్పున టొమాటో ముక్కలు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, అర చెంచా ఈనో ఫ్రూట్‌ సాల్ట్‌ వేసి కలపాలి. ఇది మరీ గట్టిగానో, పల్చగానో ఉండకూడదు. దీన్ని ఒక అరగంట పక్కనుంచాలి. రెండు చెంచాల నూనె కాగనిచ్చి.. చెంచా ఆవాలు వేయాలి. అవి చిటపటలాడుతుండగా.. ఒక్కో చెంచా చొప్పున జీలకర్ర, కచ్చాపచ్చా దంచిన మిరియాలు, అవి కూడా వేగాక.. రెండు చెంచాల నువ్వులు, నాలుగు  కరివేపాకు రెబ్బలను వేయించి.. రవ్వ మిశ్రమంలో కలపాలి. ఇడ్లీ ప్లేట్లలో నూనె రాసి.. ఈ పిండిని తగినంత వేసి, ఆవిరి మీద సుమారు పన్నెండు నిమిషాలు ఉడికించాలి. కడాయిలో చెంచా నూనె వేడిచేసి..  ఇడ్లీలను అలాగే లేదా ముక్కలుగా కోసి వేయిస్తే సరిపోతుంది. ఈ బంగాళదుంప మసాలా ఇడ్లీ వడలు చాలా రుచిగా ఉంటాయి.

కొమ్మరాజు నాగమణి, హైదరాబాద్‌  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని