చిటికెలో బిస్కెట్లు

బిస్కెట్లలో బోలెడన్ని రకాలుంటాయి కదూ! తమ తమ ఇష్టాలను బట్టి నచ్చేవి కొనుక్కుంటారు. అంతే తప్ప బిస్కెట్లు మనం తయారుచేసుకోవడం కొంచెం తక్కువ.

Published : 26 May 2024 00:36 IST

బిస్కెట్లలో బోలెడన్ని రకాలుంటాయి కదూ! తమ తమ ఇష్టాలను బట్టి నచ్చేవి కొనుక్కుంటారు. అంతే తప్ప బిస్కెట్లు మనం తయారుచేసుకోవడం కొంచెం తక్కువ. కానీ గోధుమపిండితో చేసే డైజెస్టివ్‌ బిస్కెట్లు చాలా సులువుగా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీని కోసం- స్వచ్ఛమైన గోధుమపిండి అర కిలో, పాలు, పంచదార, రవ్వ, ఎండు కొబ్బరి ఒక్కోటీ కప్పు చొప్పున, సోంపు ఒకటిన్నర స్పూన్, నెయ్యి 3 టేబుల్‌ స్పూన్లు తీసుకోవాలి. ఒక పాత్రలో ఈ పదార్థాలు అన్నిటినీ వేసి బాగా కలపాలి. మెత్తటి ఈ పిండితో కొంచెం మందమైన రొట్టెలు చేయాలి. దాని మీద గ్లాసు లేదా మూతతో నొక్కి గుండ్రటి ఆకృతులు వచ్చేలా కట్‌ చేయాలి. వాటి మీద ఫోర్క్‌తో గుచ్చి, రంధ్రాలు చేయాలి. అన్నీ పూర్తయ్యాక.. కాగుతున్న నూనెలో వేయించుకుంటే సరి.. కరకరలాడే బిస్కెట్లు తయారైపోతాయి. ఇవెంతో రుచీ, ఆరోగ్యం కూడా. నచ్చితే మీరూ చేసి చూడండి.. పిల్లలూ పెద్దలూ అందరూ ఇష్టంగా తింటారు. ఇవి చాయ్‌లోకి మరింత బాగుంటాయి.

కె.సృజన, హైదరాబాద్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని