అంజీర్‌ తింటున్నారా!

బలహీనంగా ఉన్నవారు అంజీర్‌ తింటే.. కొన్ని రోజుల్లోనే ఆశించిన మార్పు వస్తుంది- అంటారు డాక్టర్లు. ఎందుకంటే..

Published : 14 Apr 2024 00:03 IST

లహీనంగా ఉన్నవారు అంజీర్‌ తింటే.. కొన్ని రోజుల్లోనే ఆశించిన మార్పు వస్తుంది- అంటారు డాక్టర్లు. ఎందుకంటే.. అంజీర్‌లో పీచు, ఎ, బి, సి, ఇ, కె విటమిన్లు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, కాల్షియం, జింక్‌, ఫొలేట్‌, రిబోఫ్లేవిన్‌, భాస్వరం విస్తారంగా ఉన్నాయి మరి. అంజీర్‌ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిని నియంత్రించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల్లో సమస్యలు, శ్వాసలో ఇబ్బందులను తొలగిస్తుంది. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతుంది. పైల్స్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. చర్మానికి కాంతి వస్తుంది, ముడతలు పడదు. అల్జీమర్స్‌తో బాధపడేవారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని అలాగే తినొచ్చు. మిల్క్‌ షేక్‌, హల్వా లాంటివీ చేసుకోవచ్చు. అంజీర్‌ను ముందు రోజు రాత్రి నీళ్లలో నానబెట్టి, మర్నాడు పరగడుపున ఆ నీళ్లు పారబోసి తింటే చాలా మంచిది. రోజుకు రెండు లేదా మూడు వరకూ తినొచ్చు. వీటితో ఆకలి తీరి, శక్తి కలుగుతుంది కనుక ఇంకా తినాలనే ఆరాటం ఉండదు. దాంతో ఊబకాయం నుంచి తప్పించుకున్నట్టవుతుంది. ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ మధుమేహంతో బాధపడుతున్నవారు, అలర్జీ సమస్య ఉన్నవారు అంజీర్‌ తినకపోవడమే మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని