స్వీట్‌ రోటీ.. యమా టేస్టీ!

ఎప్పుడూ చేసే చపాతీలేనా అని ఇంట్లో ఎవరూ నాలుక చప్పరించకుండా ఇష్టంగా తినాలంటే.. చిన్న చిన్న ప్రయోగాలు చేయాలి. నేను చపాతీ పిండితోనే స్వీట్‌ రోటీ చేస్తాను

Updated : 31 Mar 2024 00:52 IST

ఎప్పుడూ చేసే చపాతీలేనా అని ఇంట్లో ఎవరూ నాలుక చప్పరించకుండా ఇష్టంగా తినాలంటే.. చిన్న చిన్న ప్రయోగాలు చేయాలి. నేను చపాతీ పిండితోనే స్వీట్‌ రోటీ చేస్తాను. అందుకోసం మైదాపిండి పావు కిలో, పంచదార పావు కప్పు, ముగ్గిన అరటిపండ్లు రెండు, కాచి చల్లార్చిన పాలు రెండు టేబుల్‌ స్పూన్లు, నెయ్యి తీసుకోవాలి. ముందుగా బాగా పండిన అరటిపండ్లను మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. ఇందులో పాలు, పంచదార, నెయ్యి, గోధుమపిండి వేసి కలిపి.. ఓ అర గంట నానబెట్టాలి. ఈ పిండిని చిన్న భాగాలుగా తీసుకుని.. కాస్త మందమైన రొట్టెలు చేసి పెనం మీద రెండువైపులా కాల్చుకోవాలి. సెలవు రోజుల్లో ఈ రోటీ చేస్తే.. పిల్లలూ పెద్దలూ అందరూ ఇష్టంగా తింటారు. వేడిగానే కాదు.. చల్లారినా బాగుంటాయి కనుక ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటాయి. వీటికి సైడ్‌ డిష్‌ కూడా అవసరం లేదు.

- అక్షర సింధు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని