క్యారెట్‌ కొబ్బరి జొన్నరొట్టెలు!

వంట అనేది నాకెందుకో పనిలా అనిపించదు. ఇష్టంగా చేస్తాను. తరచూ చేసేవాటితో పాటు కొత్త ప్రయోగాలంటే ఇంకా సరదా. అలాంటివాటిలో ‘క్యారెట్‌ కొబ్బరి రొట్టె’ ఒకటి.

Updated : 28 Apr 2024 12:04 IST

వంట అనేది నాకెందుకో పనిలా అనిపించదు. ఇష్టంగా చేస్తాను. తరచూ చేసేవాటితో పాటు కొత్త ప్రయోగాలంటే ఇంకా సరదా. అలాంటివాటిలో ‘క్యారెట్‌ కొబ్బరి రొట్టె’ ఒకటి. దీనికి ఏమేం కావాలంటే.. జొన్నపిండి రెండు కప్పులు, మొక్కజొన్న పిండి చెంచా, నూనె నాలుగు చెంచాలు, ఉల్లి తరుగు పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, జీలకర్ర టేబుల్‌ స్పూన్‌ చొప్పున కొత్తిమీర, పాలకూర తరుగు పావు కప్పు చొప్పున, కొబ్బరి తురుము, క్యారెట్‌ తురుము రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున, వాము పావు చెంచా, రుచికి సరిపడా ఉప్పు అవసరమవుతాయి. ఒక పాత్రలో నూనె తప్ప తక్కిన పదార్థాలన్నీ వేసి.. కొన్ని నీళ్లతో ఉండలు కట్టకుండా కలిపి పక్కనుంచాలి. పావు గంట తర్వాత.. చిన్న భాగాలుగా చేసుకుని.. అరిటాకు లేదా పాలిథిన్‌ కాగితం మీద చేత్తో మెదుపుతూ రొట్టెలు చేయాలి. వీటిని పెనం మీద కాస్త నూనెతో కాల్చుకుంటే సరి.. నోరూరించే ‘క్యారెట్‌ కొబ్బరి రొట్టెలు’ తయారైపోతాయి. అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి జోడించడాన.. నంజుకోవడానికి పల్లీ పచ్చడి, కొబ్బరి చెట్నీ వంటివి లేకున్నా సూపర్‌గా ఉంటాయివి.    

చలమల రమాదేవి, తెనాలి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని