ఇక పునుగులెంత సులువో!

పునుగులంటే పిండిని చేతిలోకి తీసుకుని కాగుతున్న నూనెలోకి జారవిడుస్తాం కదా! ఇకపై అంత ప్రయాస అవసరం లేదు. మల్టీ ఫంక్షన్‌ ఫ్రిట్టర్స్‌ మేకర్‌ పరికరంలో పిండిని సమంగా సర్ది..

Published : 05 May 2024 00:24 IST

పునుగులంటే పిండిని చేతిలోకి తీసుకుని కాగుతున్న నూనెలోకి జారవిడుస్తాం కదా! ఇకపై అంత ప్రయాస అవసరం లేదు. మల్టీ ఫంక్షన్‌ ఫ్రిట్టర్స్‌ మేకర్‌ పరికరంలో పిండిని సమంగా సర్ది.. టీ ఆకృతిలో ఉన్న కట్టర్‌ లాంటి సాధనంతో కొంత చొప్పున నూనెలో వేయాలి. ఈ అచ్చు నిలువుగా మూడు అరలుగా ఉండటంతో ఒకేసారి మూడు బాల్స్‌ కిందికి జారతాయి. ఎంత మందంగా కావాలనుకుంటే అంత చొప్పున పిండి పడేలా చేయొచ్చు. ఈ పరికరం ఉంటే శ్రమే తెలియదు, సులువుగా పనైపోతుంది. దీంతో రైస్‌బాల్స్‌, కేక్‌బాల్స్‌ లాంటివి కూడా చేయొచ్చు. ఇందులో నాన్‌స్టిక్‌ గుణం ఉండటాన పిండి అంటుకోదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని