కొంచెం తీపి.. కొంచెం కారం..

కొందరికి తీపి ఇష్టం. ఇంకొందరికి కారం ఇష్టం. రెండూ కాకుండా కాస్త తియ్యగా కాస్త కారంగా ఉంటే పిల్లలకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ఖాళీ దొరికి.. చిరుతిళ్ల మీదికి ధ్యాసపోతుంటుంది కదా!

Published : 05 May 2024 00:24 IST

కొందరికి తీపి ఇష్టం. ఇంకొందరికి కారం ఇష్టం. రెండూ కాకుండా కాస్త తియ్యగా కాస్త కారంగా ఉంటే పిల్లలకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ఖాళీ దొరికి.. చిరుతిళ్ల మీదికి ధ్యాసపోతుంటుంది కదా! అలాంటప్పుడు చేయడానికి ‘మష్రుమ్‌ లాలిపాప్స్‌’ చాలా బాగుంటాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి.

కావలసినవి: పుట్టగొడుగులు - 15, మైదా - కప్పు, ధనియాల పొడి - చెంచా, పసుపు - పావు చెంచా, ఛాట్‌ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - టేబుల్‌స్పూన్‌ చొప్పున, మిరియాల పొడి - అర టేబుల్‌ స్పూన్‌, మొక్కజొన్నపిండి - 2 టేబుల్‌స్పూన్లు, బ్రెడ్‌ పొడి, ఓట్స్‌ పౌడర్‌ - అర కప్పు చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ: ముందుగా పుట్టగొడుగులను కడిగి, 5 నిమిషాలు వేడి నీళ్లలో ఉంచి, ఆ నీళ్లు తీసేసి పక్కనుంచాలి. ఓ వెడల్పాటి గిన్నెలో మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు, ఛాట్‌ మసాలా, ధనియాల పొడి, పసుపు, మిరియాల పొడి వేసి.. తగినన్ని నీళ్లతో పేస్ట్‌లా కలపాలి. ఇది మరీ చిక్కగా, మరీ జారుగా ఉండకూడదు. ఇలా మైదా మ్యారినేషన్‌ సిద్ధం చేసుకోవాలి. మరో గిన్నెలో మొక్కజొన్నపిండి, బ్రెడ్‌ పౌడర్‌, ఓట్స్‌ పొడి వేసి కలపాలి. కడాయిలో నూనె కాగనిచ్చి.. ఒక్కో పుట్టగొడుగును పుల్లకు (టూత్‌ పిక్‌ వంటిది) గుచ్చి.. మైదాపిండిలో ముంచి తీసి, బ్రెడ్‌పొడి మిశ్రమంలో పొర్లించిన తర్వాత నూనెలో వేయించాలి. అంతే పుట్టగొడుగుల లాలిపాప్స్‌ రెడీ. వేడివేడిగా టొమాటో సాస్‌ లేదా చిల్లీసాస్‌తో తిని ఆనందించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని