రుచికరమైన ఎగ్‌ మంచూరియా

మా అబ్బాయికి ఎగ్‌ మంచూరియా చాలా ఇష్టం. కానీ నాకు అంతగా కుదరడం లేదు. మరింత టేస్టీగా చేయడానికి కొన్ని టిప్స్‌ చెప్పండి!

Updated : 19 May 2024 05:07 IST

మా అబ్బాయికి ఎగ్‌ మంచూరియా చాలా ఇష్టం. కానీ నాకు అంతగా కుదరడం లేదు. మరింత టేస్టీగా చేయడానికి కొన్ని టిప్స్‌ చెప్పండి!

  • ఎగ్‌ మంచూరియా కోసం కొన్ని గుడ్లను 10 నుంచి 12 నిమిషాలు ఉడికించి, పొడవుగా, నాలుగు చీలికలుగా కట్‌ చేయాలి.
  • ఇంకొన్ని గుడ్లు పగలకొట్టి.. సొనలో ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. అందులో మైదా, కార్న్‌ ఫ్లోర్‌ వేసి మళ్లీ కలపాలి. ఈ మిశ్రమంలో కట్‌ చేసిన గుడ్లను ముంచి, కాగిన నూనెలో నెమ్మదిగా వేయాలి. గరిట పెట్టకుండా ఒక నిమిషం వదిలేసి తర్వాత లేత బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి. 
  • కడాయిలో కాస్త నూనె వేసి.. అల్లం, వెల్లులి తరుగు, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. గోధుమ రంగులోకి మారాక.. మిర్చి, టొమాటో, సోయా సాస్, కారం, ఉప్పు వేసి హై ఫ్లేమ్‌ మీద ఎగరేసినట్లు చేయాలి. అందులో కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. కొంచెం చిక్కబడింది అనుకున్నాక.. వేయించిన గుడ్లు వేసి.. కలియ తిప్పాలి. 
  • చివర్లో ఉల్లి కాడల తరుగు వేసి.. దింపేయాలి. ఎగ్‌ మంచూరియా వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటుంది.

పవన్‌ సిరిగిరి, చెఫ్, హైదరాబాద్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని