Mangoes: ఈ మామిడి.. కిలో రెండున్నర లక్షలు!
మామిడిపండ్ల సీజన్‌లో ధర చూడకుండా దొరికినప్పుడే తినాలన్నట్టుగా తింటాం. కానీ మియాజాకీ మామిడిపండ్ల ధర వింటే మాత్రం నోరెళ్లబెడతారు?
మామిడిపండ్ల సీజన్‌లో ధర చూడకుండా దొరికినప్పుడే తినాలన్నట్టుగా తింటాం. కానీ మియాజాకీ మామిడిపండ్ల ధర వింటే మాత్రం నోరెళ్లబెడతారు? అవును వీటి ధర కిలో రెండున్నర లక్షలు...
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లివి. ధర రూ.రెండున్నర లక్షలు. జపాన్‌లో ఈ పండ్లని బంగారం కన్నా ఎక్కువగా భావిస్తారు. ప్రత్యేక పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తగా పండిస్తారు. ఒక్కోదాని బరువు సుమారుగా 300గ్రా ఉంటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే 900గ్రా వరకూ బరువు తూగుతాయి. మొదట్లో ఉదా రంగులో ఆకట్టుకొనే ఈ పండ్లు పండేకొద్దీ ఎర్రగా మారిపోతాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో ఇవి దొరకుతాయి. మొదట్లో జపాన్‌లో మాత్రమే అది కూడా వేలంపాటలో గెలిచిన వారికి మాత్రమే దొరికే ఈ పండ్లని ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇండియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ వంటి చోట్ల కూడా పండిస్తున్నారు. వీటి తర్వాత అంత ఆదరణ పొందుతున్న మరో రకం హరోయుకి నకగవ. ఒక్కో పండూ సుమారుగా 19వేల రూపాయలు. ఇంత ఖరీదు ఎందుకంటే అద్భుతమైన రుచితోపాటు ఇవి శీతాకాలంలో మాత్రమే పండుతాయి కాబట్టి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
YS Jagan: రేపు దిల్లీకి సీఎం జగన్.. హఠాత్తుగా సామర్లకోట పర్యటన వాయిదా
-
స్నేహితులను వరించిన అదృష్టం.. లాటరీలో రూ.కోటిన్నర గెలుపు
-
ఏపీలో ఇంజినీరింగ్లో మూడో విడత కౌన్సెలింగ్ ఎత్తివేత
-
Guntur: సహజీవనం నేపథ్యంలో వివాదం.. యువకుడిపై మహిళ యాసిడ్ దాడి
-
రైళ్ల కొత్త టైంటేబుల్ విడుదల
-
టైప్-2 మధుమేహంతో ఆయుక్షీణం