పుచ్చకాయ తిని.. ప్రశాంతంగా ఉండండి!

ఎండలో బయటకు వెళ్లినప్పుడు పుచ్చకాయ ముక్కలను తిని దాహం తీర్చుకోవడం మామూలే. దీంట్లో ఉండే పోషకాల ...

Published : 11 Apr 2021 00:35 IST

పోషకాలమ్‌

ఎండలో బయటకు వెళ్లినప్పుడు పుచ్చకాయ ముక్కలను తిని దాహం తీర్చుకోవడం మామూలే. దీంట్లో ఉండే పోషకాల గురించి తెలుసుకుంటే తరచూ తీసుకోకుండా ఉండలేరు. అవేమిటంటే...

పుచ్చకాయలో విటమిన్‌-ఎ, బి1, బి6, సి ఉన్నాయి. పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, బయోటిన్‌.. లాంటి పోషకాలూ ఎన్నో ఉన్నాయి.
తక్కువ కెలొరీలు, ఎక్కువ పోషకాలుంటాయి. పీచు పదార్థం, నీరూ ఎక్కువే. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
విటమిన్‌-ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్‌-సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తుంది. వడదెబ్బ నుంచీ రక్షిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను సమర్థంగా బయటకు పంపడానికి తోడ్పడుతుంది.
జీర్ణసంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. గ్యాస్‌, అజీర్ణం నుంచి ఉపశమనం పొందొచ్చు.
నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. దీంతో ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని