విందులో కంద చేరితే...

కందలేని కార్తీకమాసం ఉంటుందా? కందా, బచ్చలి.. కందకూర.. ఇలా రుచిలో అద్భుతంగా ఉండే ఈ కూర, పోషకాల్లోనూ అద్భుతమే తెలుసా?

Published : 06 Nov 2022 00:44 IST

కందలేని కార్తీకమాసం ఉంటుందా? కందా, బచ్చలి.. కందకూర.. ఇలా రుచిలో అద్భుతంగా ఉండే ఈ కూర, పోషకాల్లోనూ అద్భుతమే తెలుసా?

* కొవ్వు తక్కువగా ఉండి... చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే ఈ ఆహారంలో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి.

* యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ ఆహారం చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది.

* దీనిలో పెద్దమొత్తంలో ఉండే పీచు శరీరంలోని వ్యర్థాలని బయటకు నెట్టేసి కాలేయాన్ని కాపాడుతుంది. పొట్టలో నులిపురుగులు వంటివి లేకుండా చేస్తుంది.

* కంద సహజసిద్ధమైన ప్రొబయాటిక్‌ ఆహారం.. జీర్ణక్రియకు అవసరమైన మంచి బ్యాక్టీరియాని బతికించి జీర్ణశక్తిని పెంచుతుంది.

* మధుమేహంతో బాధపడేవారిలో.. ఈ ఆహారం ఒక్కసారిగా చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తుంది.

* సహజసిద్ధమైన పెయిన్‌కిల్లర్‌గా పనిచేసే కందని చర్మరోగాలున్నవారు తినకపోవడమే మంచిది. రుచి ఎంత బాగున్నా ఎక్కువగా తినకపోవడమే మేలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని