పనీర్‌ బటర్‌ మసాలాకి.. ఇంట్లోనూ హోటల్‌ రుచి రావాలంటే..

మా పిల్లలకి పనీర్‌ బటర్‌ మసాలా అంటే చాలా ఇష్టం. వేయాల్సిన దినుసులన్నీ వేస్తున్నా, ఎందుకో హోటల్‌లో వచ్చే రంగు, రుచి రావడం లేదు.

Published : 27 Nov 2022 00:16 IST

మా పిల్లలకి పనీర్‌ బటర్‌ మసాలా అంటే చాలా ఇష్టం. వేయాల్సిన దినుసులన్నీ వేస్తున్నా, ఎందుకో హోటల్‌లో వచ్చే రంగు, రుచి రావడం లేదు. దీనికేమన్నా చిట్కాలుంటాయా?

కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే మీరుకూడా హోటల్‌లో వండినట్టుగా చక్కని రంగు, రుచితో పనీర్‌ బటర్‌ మసాలాని చేసుకోవచ్చు. వండటానికి ముందు పనీర్‌ని ముక్కలుగా కోసి వేడినీటిలో వేసి ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల అవి తింటున్నప్పుడు రబ్బరులా సాగకుండా మృదువుగా ఉంటాయి. దీనిలో గ్రేవీ ప్రధానం కదా! ఇందుకోసం పచ్చి టొమాటోలని వాడితే హోటల్‌లో కనిపించినట్టుగా రాదు. పండిన టొమాటోలు రంగుతోపాటు చక్కని గ్రేవీని అందిస్తాయి. టొమాటోలు పుల్లగా ఉన్నాయనిపిస్తే.. కాసిని టొమాటో ముక్కలు తగ్గించి అందుకు తగ్గట్టుగా  టొమాటో కెచప్‌ని వాడి చూడండి. తీపి, పులుపు రుచి భలే ఉంటుంది. బయటకొన్న గరంమసాలా కన్నా, ఇంట్లో చేసినదైతే చక్కని పరిమళం, రుచి రెండూ సొంతమవుతాయి. ఇంట్లో ఉన్న కారం కాకుండా కాశ్మీర్‌ కారం పొడి ప్రత్యేకంగా దొరుకుతుంది. అది వేస్తే కమ్మదనంతోపాటు మంచి రంగు వస్తుంది. ఇక చివర్లో వేసే తాజా వెన్న, కొద్దిగా కసూరీమేథీ ఈ కూరకి ప్రత్యేక రుచిని తీసుకొస్తాయి.

పవన్‌ సిరిగిరి, చెఫ్‌ హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని