లవంగీ కూర!

చూడ్డానికి పెద్ద సైజు లవంగాల్లా, మల్లెమొగ్గల్లా భలేగా ఉన్నాయే అనుకుంటున్నారా? అందుకే వీటిని క్లోవ్‌ బీన్స్‌ అనీ లవంగీ బీన్స్‌ అనీ అంటారు.

Published : 04 Dec 2022 00:31 IST

చూడ్డానికి పెద్ద సైజు లవంగాల్లా, మల్లెమొగ్గల్లా భలేగా ఉన్నాయే అనుకుంటున్నారా? అందుకే వీటిని క్లోవ్‌ బీన్స్‌ అనీ లవంగీ బీన్స్‌ అనీ అంటారు. ఈ మధ్యకాలంలో దాదాపు అన్నిచోట్లా వీటిని పండిస్తున్నారు. వంకాయలు, బెండకాయలు వండినట్టుగా దీనితోనూ రుచికరమైన కూరలు చేసుకోవచ్చు..

* పాదులా పాకే ఈ కాయగూరని కేరళలో ఇంటింటికీ పెంచుతారు. ఏడాదిపొడవునా పండుతుంది కాబట్టి.. నిత్య కాయగూర అంటారు వాళ్లు దీనిని. పీచు అధికంగా ఉంటుంది. విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఈ కాయగూరని జ్వరం నుంచి కోలుకోవడానికి తింటారు.
* ఎటువంటి చీడపీడలు పట్టవు... సులభంగా పెరుగుతుంది కాబట్టి దీనిని తెలుగు ప్రాంతాల్లోనూ ఇష్టంగా పెంచుతున్నారు. కొబ్బరి వేసుకుని బెండకాయలు, దొండకాయలు వండినట్టుగా వండేసుకోవచ్చు. నిదానంగా జీర్ణమై శరీరంలో చక్కెర స్థాయిలు ఒక్కసారి పెరగకుండా చూస్తూ రోజంతా శక్తినీ, ఉత్సాహాన్ని ఇస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని