ప్రపంచం మెచ్చిన వంటకం పన్నీరు పసంద!

ఈ ఏడాదికి వీడ్కోలు పలికే సమయం దగ్గరకు వచ్చింది కదా! మరి ఈ సంవత్సరం మీరు ఇష్టంగా తిన్న వంటకం ఏది? ఆలోచించండి! గూగుల్‌ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఈ ఏడాది ఇష్టంగా వెతికిన వంటకాలు ఏవో తెలుసుకొనే ప్రయత్నం చేసింది.

Updated : 18 Dec 2022 00:28 IST

2022లో..

ఈ ఏడాదికి వీడ్కోలు పలికే సమయం దగ్గరకు వచ్చింది కదా! మరి ఈ సంవత్సరం మీరు ఇష్టంగా తిన్న వంటకం ఏది? ఆలోచించండి! గూగుల్‌ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఈ ఏడాది ఇష్టంగా వెతికిన వంటకాలు ఏవో తెలుసుకొనే ప్రయత్నం చేసింది. ఆ జాబితాలో ముందున్న వంటకం పనీర్‌ పసంద్‌! తాజా పనీర్‌, మసాలాలు కలిపి చేసే ఈ వంటకాన్ని 2022లో ఎక్కువ మంది వండటానికీ, కొనడానికి ప్రయత్నించారట. చికెన్‌, మటన్‌ వంటి నాన్‌వెజ్‌ వంటకాలని కూడా తోసిరాజని ఈ పనీర్‌ పసంద ముందు వరుసలో ఉండటం విశేషం. గూగుల్‌ మొత్తం పది వంటకాలు వెల్లడిస్తే పనీర్‌ బుర్జీకూడా కూడా వాటిల్లో ఒకటి. పనీర్‌ని తురిమి చేసే ఈ వంటకాన్ని కూడా ఎక్కువమంది ఆదరించారట. ఈ ధోరణి చూస్తుంటే... ప్రజలు మాంసాహార వంటకాలకన్నా శాకాహారం వైపు అడుగులు వేస్తున్నారని ఈ ట్రెండు చెబుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని