నానబెట్టడం మర్చిపోయారా?

కొంతమంది వంట చేస్తే అద్భుతంగా ఉంటుంది. మరికొంతమంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుని వంట చేసినా రుచీపచీ ఉండదు. దానికి కారణం చిన్నచిన్న చిట్కాలు తెలియకపోవడమే అంటారు ప్రముఖ చెఫ్‌ సంజీవ్‌కపూర్‌..

Published : 05 Mar 2023 00:27 IST

కొంతమంది వంట చేస్తే అద్భుతంగా ఉంటుంది. మరికొంతమంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుని వంట చేసినా రుచీపచీ ఉండదు. దానికి కారణం చిన్నచిన్న చిట్కాలు తెలియకపోవడమే అంటారు ప్రముఖ చెఫ్‌ సంజీవ్‌కపూర్‌..

* కూరలోకి సెనగపప్పుని నానబెట్టడం మర్చిపోయారా. ఇప్పుడెలా? మరేం ఫర్వాలేదు. వేడినీళ్లలో గంటన్నరపాటు నానబెట్టండి. రుచికరమైన కూరలు వండుకోవచ్చు.

* కొబ్బరిపాలని తీసిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా? దానిపై వచ్చిన నీళ్లలాంటి తేటని పారేయొద్దు. ఆ నీరుని కూరల్లో నూనెకు బదులుగా వాడుకోవచ్చు. కూరలు చాలా రుచిగా ఉంటాయి.

* బంగాళాదుంపల్ని ఉడికిస్తున్నారా?ఆ నీటిలో చెంచా వెనిగర్‌ వేయండి. త్వరగా ఉడికిపోతాయి. ఆకృతి చెడిపోకుండా చూడచక్కగా ఉంటాయి.

* క్యాబేజీకానీ, క్యాలిఫ్లవర్‌ కానీ ఉడికిస్తుంటే ఆ నీటిలో కొద్దిగా పాలపొడి వేయండి. రంగు మారకుండా ఉడుకుతాయి. రుచీ బాగుంటుంది


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని