కుక్కర్‌ పలావ్‌ తింటారా..

పబ్‌ అన్న పదం వినగానే... అది యువతకు అడ్డా అని, మద్యం తాగే ప్రదేశమని ఫిక్సయిపోకండి. దానికి అర్థమే మార్చేసింది హైదరాబాద్‌లోని షెర్లాక్స్‌ అండ్‌ కిచెన్‌ లాంజ్‌.

Updated : 12 Mar 2023 15:30 IST

బ్‌ అన్న పదం వినగానే... అది యువతకు అడ్డా అని, మద్యం తాగే ప్రదేశమని ఫిక్సయిపోకండి. దానికి అర్థమే మార్చేసింది హైదరాబాద్‌లోని షెర్లాక్స్‌ అండ్‌ కిచెన్‌ లాంజ్‌. ఇక్కడ కాలేజీ విద్యార్థులూ, భార్యాభర్తలూ, బంధువులూ, స్నేహితులూ, మహిళా బృందాలు, తల్లీ పిల్లలూ, పెద్దలూ, కుటుంబం... ఇలా ఎవరైనా సరే హ్యాపీగా ఎంజాయ్‌ చేసేయొచ్చు. వయసుకి తగ్గ ప్రత్యేక విభాగాలతో వినూత్నంగా తీర్చిదిద్దిన ఈ లాంజ్‌లో ఇష్టమైన వంటకాలు తింటూ, నచ్చిన డీజే సంగీతానికి తగ్గట్లు అడుగులు కదుపుతూ ఆస్వాదించొచ్చు.  

‘షెర్లాక్స్‌ లాంజ్‌ అండ్‌ కిచెన్‌’ పుట్టిల్లు బెంగళూరు. 1991లోనే అక్కడ మొదలైనప్పటికీ... హైదరాబాద్‌లో మాత్రం కొత్త థీమ్‌తో, వయసుకి తగ్గ ప్రత్యేక ఏర్పాట్లతో, విభిన్న సదుపాయాలూ ఆకర్షణలూ, వైవిధ్యమైన ఆహార రుచులతో దీన్ని తీర్చిదిద్దాం అంటారు డా. ప్రీతి రెడ్డి. ఎంబీఏ చేసిన ఆమె...యూరోపియన్‌ కన్‌స్టక్ష్రన్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేసే సమయంలో వివిధ దేశాలు తిరిగారట. అలా ఓ సారి జర్మనీ వెళ్లినప్పుడు మన దగ్గర వీధి చివర కాఫీ షాపులు ఉన్నట్లు ఫ్యామిలీ పబ్బులు ఉండటం గమనించారు. పెళ్లయి హైదరాబాద్‌ వచ్చాక ఆ కాన్సెప్ట్‌నే వ్యాపారంగా మలుచుకున్నారు. పిల్లలకోసం లైవ్‌ పిజ్జా, మాంసాహార ప్రియులు మెచ్చే సీజనల్‌ వంటకాలూ, కుక్కర్‌ పలావ్‌ వీరి ప్రత్యేకత. ఏ వయసు వారైనా తినేలా...పప్పుచారన్నం నుంచి అమెరికన్‌ స్పాగెట్టీ క్రంచ్‌ వరకూ అన్నీ ఇక్కడ దొరుకుతాయి.

స్వాతి, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని