పొటాటో ట్విస్టర్‌

బంగాళదుంప చిప్స్‌లో చాలా రకాలు తిని ఉంటారు. కానీ పొటాటో ట్విస్టర్‌ ఎప్పుడైనా రుచి చూశారా? కొందరు స్ట్రీట్‌ ఫుడ్‌ వెండర్లు వీటిని తయారుచేస్తున్నారు.

Updated : 21 Jan 2024 03:17 IST

బంగాళదుంప చిప్స్‌లో చాలా రకాలు తిని ఉంటారు. కానీ పొటాటో ట్విస్టర్‌ ఎప్పుడైనా రుచి చూశారా? కొందరు స్ట్రీట్‌ ఫుడ్‌ వెండర్లు వీటిని తయారుచేస్తున్నారు. ఇవి చేయడం చాలా సులువు కూడా. ఎలా చేస్తారంటే.. బంగాళదుంపకు సన్నటి చువ్వ గుచ్చి, చిన్న మరలో పెట్టి తిప్పగా.. అది పూర్తిగా తెగకుండా.. చుట్టగా మెలితిరిగి, రింగులు రింగులుగా తయా వస్తుంది. దాన్నోసారి శనగపిండి మిశ్రమంలో ముంచి.. నూనెలో వేయిస్తారు. తర్వాత మసాలా పొడి చల్లుతారు. అంతే.. పొటాటో ట్విస్టర్‌ సిద్ధం. ఇదెంతో ఆకర్షణీయంగా, నోరూరించేలా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని