హోటల్‌ స్టైల్‌ క్రీమీ టొమాటో పాలక్‌ పాస్తా

పసందైన ‘క్రీమీ టొమాటో పాలకూర పాస్తా’ తయారీ చాలా కష్టమనుకుంటారు.

Published : 18 Feb 2024 00:04 IST

పసందైన ‘క్రీమీ టొమాటో పాలకూర పాస్తా’ తయారీ చాలా కష్టమనుకుంటారు. నిజానికిది సులభమే. ఎలా చేయాలంటే.. 2 కప్పులు పాస్తా, 2 చెంచాలు ఆలివ్‌ నూనె, చెంచా చొప్పున మిరియాల పొడి, వెల్లుల్లి తరుగు, కాస్త ఉప్పు, ఒక ఉల్లిపాయ, 2 టొమాటోలు, 50 గ్రాములు మష్రూమ్స్‌, కట్ట పాలకూర, 5 చెంచాలు వెజ్‌ మేయోనేజ్‌, 2 టేబుల్‌ స్పూన్లు చీజ్‌ తురుము తీసుకోవాలి.

పాస్తాలో ఉప్పు వేసి ఏడెనిమిది నిమిషాలు ఉడికించండి. అడుగంటకుండా అప్పుడప్పుడు కలియ తిప్పుతుండాలి. దించేసి, నీళ్లు తీసేయండి. కడాయిలో నూనె వేసి.. సన్న సెగమీద వెల్లుల్లి, ఉల్లి తరుగు వేయించండి. అర నిమిషం తర్వాత టొమాటో ముక్కలు, రెండు నిమిషాల తర్వాత మష్రూమ్‌ ముక్కలు, పాలకూర తరుగు వేసి.. ఇంకో మూడు నిమిషాలు ఉడికించండి. చిటికెడు ఉప్పు, పావు చెంచా మిరియాల పొడి వేసి కలపండి. ఒకసారి కడాయి పక్కకు తీసి.. మేయోనేజ్‌ వేసి కలిపి.. మళ్లీ స్టవ్వు మీద పెట్టండి. నీరు ఇంకిన తర్వాత.. ఉడికించిన పాస్తా జతచేసి.. కలియతిప్పి దించేయండి. ఇది రుచిగా ఉండటమే కాదు, మంచి పోషకాహారం కూడా.

 పవన్‌ సిరిగిరి, చెఫ్‌, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని