క్యాలీఫ్లవర్‌ + బ్రోకలీ = రోమనెస్కో

తెల్లటి క్యాలీఫ్లవర్‌, ఆకుపచ్చ బ్రోకలీ మనందరికీ తెలిసినవే. కానీ ఈ రెండిటి కలయికలా ఉంటే రోమనెస్కో బ్రోకలీ గురించి విన్నారా?

Published : 18 Feb 2024 00:02 IST

తెల్లటి క్యాలీఫ్లవర్‌, ఆకుపచ్చ బ్రోకలీ మనందరికీ తెలిసినవే. కానీ ఈ రెండిటి కలయికలా ఉంటే రోమనెస్కో బ్రోకలీ గురించి విన్నారా? వండేశాక వచ్చే రుచి కూడా క్యాలీఫ్లవర్‌, ఆకుపచ్చ బ్రోకలీ రెండూ కలగలిపినట్లే ఉంటుంది. ఇది అనేక మొగ్గల్ని ఏర్చికూర్చినట్లు ఉంటుంది. చూడటానికి ఇంకా పూర్తిగా పక్వం కాని మొగ్గలా ఉంటుంది. కానీ తినబోతే.. అలాంటి పసరుతనం లేకపోగా కాస్త తియ్యదనమూ ఉంటుంది. ఇందులో సి, కె విటమిన్లు, పీచు, కెరోటినాయిడ్స్‌, జియాక్సంతిన్‌, బీటా కెరోటిన్‌లు విస్తారంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అన్నిటినీ మించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఎముకలకు పటుత్వం వస్తుంది. కళాత్మక డిజైన్‌తో చేసినట్లుండే సాధారణంగా రోమనెస్కో పసుపు, ఆకుపచ్చ కలగలిసిన రంగులో ఉంటుంది. కొన్ని నారింజ, పసుపు, ఊదా రంగుల్లోనూ చూస్తాం. ఈ రోమనెస్కోను మొదట సాగుచేసింది ఇటలీలో. ఇప్పుడు అమెరికా, కెనడా, ఇంగ్లండ్‌ దేశాల్లోనూ పండిస్తున్నారు. ఈ పంట 75 నుంచి 100 రోజుల్లో పక్వానికి వస్తుంది. కాస్త తియ్యగా, కొంత వగరుగా ఉండే వీటిని కొందరు పచ్చిగానే తిన్నప్పటికీ.. ఎక్కువమంది ఉడికించినవి తినడానికి ఇష్టపడతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని