సేల్‌ రోటీ.. సులభంగా చేసేద్దాం!

స్వీట్లు ఇష్టపడని వాళ్లుండరు కదూ! మనం తరచూ తినే లడ్డూ, బర్ఫీ లాంటివి ఎంత బాగున్నా.. కొన్నిసార్లు కొత్త రుచులు కావాలనిపిస్తుంది. అలాంటప్పుడు ‘సేల్‌ రోటీ’ చేసి చూడండి.. ఇది సిక్కిం రాష్ట్రంలో ప్రసిద్ధం.

Published : 25 Feb 2024 00:06 IST

పొరుగు రుచి

స్వీట్లు ఇష్టపడని వాళ్లుండరు కదూ! మనం తరచూ తినే లడ్డూ, బర్ఫీ లాంటివి ఎంత బాగున్నా.. కొన్నిసార్లు కొత్త రుచులు కావాలనిపిస్తుంది. అలాంటప్పుడు ‘సేల్‌ రోటీ’ చేసి చూడండి.. ఇది సిక్కిం రాష్ట్రంలో ప్రసిద్ధం. ఈ రోటీ చేసేందుకు రెండు కిలోల బియ్యం, పావుకిలో పంచదార, కప్పు నెయ్యి, వేయించేందుకు సరిపడా నూనె, అర చెంచా చొప్పున దాల్చినచెక్క, యాలకుల పొడి, ఒక స్పూన్‌ బేకింగ్‌ పౌడర్‌ అవసరమవుతాయి.

ఎలా చేయాలంటే.. బియ్యం కడిగి ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మర్నాడు ఉదయం నీళ్లు వంపేసి.. పంచదార, దాల్చినచెక్క, యాలకుల పొడి వేసి గ్రైండ్‌ చేయాలి. అందులో నెయ్యి, బేకింగ్‌ పౌడర్‌ కూడా వేసి బాగా కలపాలి. చిక్కటి ఈ మిశ్రమాన్ని గరాటును పోలిన పరికరంలో వేసి కాగుతున్న నూనెలో గుండ్రంగా తిప్పితే.. పెద్ద చేగోడీలా వస్తుంది. దీన్ని బంగారు రంగులోకి మారాక తీయాలి. తక్కిన పిండితోనూ ఇలాగే చేయాలి. అంతే ‘సేల్‌ రోటీ’ రెడీ. నోరూరించే ఈ తేలికైన స్వీటును మనమూ చేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని