వహ్వా అనిపించే పాలక్‌ కట్‌లెట్‌

రోజూ చేసే మామూలు వంటలతో పాటు కొన్నిసార్లు వంటల ప్రోగ్రాములు చూసి.. కొన్ని మార్పులతో ప్రయోగాలు చేస్తుంటాను. అలా పాలక్‌ కట్‌లెట్‌ ప్రయత్నించాను. మా వాళ్లందరికీ చాలా నచ్చింది.

Published : 03 Mar 2024 00:34 IST

రోజూ చేసే మామూలు వంటలతో పాటు కొన్నిసార్లు వంటల ప్రోగ్రాములు చూసి.. కొన్ని మార్పులతో ప్రయోగాలు చేస్తుంటాను. అలా పాలక్‌ కట్‌లెట్‌ ప్రయత్నించాను. మా వాళ్లందరికీ చాలా నచ్చింది. ఎలా చేయాలంటే.. ముందుగా పాలకూర, కొత్తిమీర ఒక్కో కట్ట చొప్పున తీసుకుని.. కడిగి, తరగాలి. ఒక పాత్రలో కప్పున్నర శనగపిండి, అర కప్పు బియ్యప్పిండి, తగినంత ఉప్పు వేసి.. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ.. ఉండలు కట్టకుండా పకోడీ పిండిలా కలపాలి. అందులో పావు చెంచా గరం మసాలా, అర చెంచా పసుపు, ఒక చెంచా కారం, ఇంకో చెంచా ధనియాల పొడి, రెండు స్పూన్ల నువ్వులు వేసి బాగా కలిపి.. పక్కనుంచుకోవాలి. కడాయి అయితే పిండి అడుగంటుతుంది కనుక నాన్‌స్టిక్‌ ప్యాన్‌లో రెండు చెంచాల నూనె కాగనిచ్చి.. పావు చెంచా ఇంగువ, చెంచా జీలకర్ర, చెంచా పచ్చిమిర్చి ముద్ద వేసి వేయించాలి. అవి దోరగా వేగి.. కమ్మటి వాసన వస్తున్నప్పుడు పాలకూర, కొత్తిమీర తరుగు వేయాలి. వాటిలో ఉన్న చెమ్మ ఇంకిపోయి.. పచ్చివాసన పోయే వరకూ వేగనివ్వాలి. అందులో శనగపిండిని జతచేసి కలియ తిప్పుతూ వేయించాలి. చక్కగా వేగిందనుకున్నాక.. దించేయాలి. ఈ మిశ్రమాన్ని నేతితో గ్రీస్‌ చేసిన పళ్ల్లెంలోకి తీసి సమంగా సర్దాలి. పైన కొన్ని నువ్వులు, కాసిని చిల్లీ ఫ్లేక్స్‌ చల్లి.. నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కట్‌ చేయాలి. చల్లారిన తర్వాత తింటుంటే.. అద్భుతం అనకుండా ఉండలేరు.

సి.అశ్విని హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు